AP Panchayat Elections Live Updates : ఏపీ పంచాయతీ ఎన్నికల పోలింగ్
AP Panchayat Elections Live Updates : ఆంధ్రప్రదేశ్‌లో మెుదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 23 మున్సిపాలిటీల్లోనూ పోలింగ్ జరుగుతోంది.
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 3,240 గ్రామ పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం అధికారులు 34,312 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 70 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు.

ఏపీలో మెుదటి విడుత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓటువేసేందుకు జనాలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
- {{^htLoading}}
{{/htLoading}}
- 26 Nov 2026, 11:53:32 AM IST
టీడీపీ నేతల మధ్య వాగ్వాదం
కర్నూలు జిల్లా మండగిరి పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సర్పంచ్ అభ్యర్థి టీడీపీ నుంచి ఉండగా.. ఇంకో వర్గం వేరే అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారని గొడవ జరిగింది.
- 26 Nov 2026, 11:50:19 AM IST
ఉండవల్లిలో నా ఓటు హక్కును వినియోగించుకున్నా : చంద్రబాబు
'రాజ్యాంగ దినోత్సవం రోజున కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లిలో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు మన హక్కు మాత్రమే కాదు.. మన బాధ్యత కూడా. మన ప్రాంతాల అభివృద్ధికి, భవిష్యత్తుకు ఓటు ఎంతో కీలకం. ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం.' సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 26 Nov 2026, 11:43:34 AM IST
ఓటు వేసిన నారా ఫ్యామిలీ
Cast my vote along with my family at the 53rd Division polling booth in Undavalli for the Mangalagiri-Tadepalli Municipal Corporation elections today. Every vote shapes the future of our community. I urge all eligible voters to step out and exercise their democratic right! #APLocalBodyElections
— Lokesh Nara (@naralokesh) November 26, 2026 - 26 Nov 2026, 11:41:34 AM IST
ఓటు వేయాలి : నారా లోకేశ్
ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఓటు ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ 53వ డివిజన్‌లో లోకేష్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 26 Nov 2026, 11:36:37 AM IST
ఓటేసిన చంద్రబాబు ఫ్యామిలీ
సీఎం చంద్రబాబు ఫ్యామిలీ స్థానిక ఎన్నికల్లో భాగంగా ఓటువేశారు. నారా భువనశ్వరి, లోకేశ్, బ్రాహ్మిణితో కలిసి వచ్చి చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- 26 Nov 2026, 11:32:48 AM IST
గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్
గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- {{^htLoading}}
{{/htLoading}}