Live

AP Panchayat Elections 2nd Phase Polling : కొనసాగుతున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మెుదలైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. ఆ తర్వాత ఫలితాలు వెలుడుతాయి.

Summary

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. సీసీ కెమెరా, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

ఏపీ రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఏపీ రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నడుస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. రెండో దశలో 3880 గ్రామపంచాయతీల్లో 3803 సర్పంచ్, 29603 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తు్న్నారు. మెుత్తం 8352338 మంది ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. మెుత్తం 37వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

...Read More

Follow all the updates here:
Nov 29, 2026, 10:28:39 IST

ఈ జిల్లాల్లో ఇలా

కర్నూలులో ఉదయం 9 గంటల వరకు 27.17 శాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో 26.01 శాతంగా పోలింగ్ నమోదైంది.

Nov 29, 2026, 10:00:03 IST

శ్రీకాకుళం జిల్లా పోలింగ్ శాతం

శ్రీకాకుళం జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 21.13 శాతం పోలింగ్ నమోదైంది. మెుదటి రెండు గంటల్లో 1,19,894 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులకంటే మహిళలు అధికంగా ఓటువేశారు.

Nov 29, 2026, 09:14:06 IST

అనంతపురంలో దాడి

అనంతపురం జిల్లా యల్లనూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. దీంతో పలువురికి గాయాలు అవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు.

Nov 29, 2026, 09:11:00 IST

మారిన గుర్తులు

బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తాటిగిరిపాడులో ఎన్నికల గుర్తుల విషయంలో గందరగోళం నెలకొంది. నాల్గోవార్డుకు సంబంధించి బ్యాలెట్ పత్రంలో మంచం గుర్తుకు బదులుగా.. ప్రెషర్ కుక్కర్ గుర్తు ముద్రించారు. సర్పంచ్ అభ్యర్థికి కేటాయించాల్సిన మంచం గుర్తును వార్డు సభ్యుడికి కేటాయించారు. దీంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సరైన గుర్తులతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Nov 29, 2026, 09:08:56 IST

ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత

ప్రకాశం జిల్లా తల్లూరు మండలం నాగంబట్లపాలెంలోని ఓ పోలింగ్ కేంద్రం ఉద్రిక్తత నెలకొన్నది. కొంతమంది వ్యక్తులు ప్రవేశించి బ్యాలెట్ బాక్సుల్లో నీరు, సీరా పోశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.

Nov 29, 2026, 09:06:28 IST

కొనసాగుతున్న పోలింగ్

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ నడుస్తోంది. జనాలు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

Home Andhra pradesh AP Panchayat Elections 2nd Phase Polling : కొనసాగుతున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్