LIVE

AP MPTC ZPTC Election Result Live Updates : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు - ఉదయం 8 గంటలకు కౌంటింగ్

Nov 6, 2026, 22:15:56 IST

AP MPTC ZPTC Election Result Live Updates : ఏపీలో పరిషత్ పోరు ముగిసింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీపడ్డ వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. శనివారం(నవంబర్ 07, 2026) ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు - లైవ్ అప్డేట్స్ (AI Gemini Image)
ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు - లైవ్ అప్డేట్స్ (AI Gemini Image)

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది. సాయంత్రం వరకల్లా పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి.

Follow all the updates here:
  • 6 Nov 2026, 10:15:56 PM IST

    ఎంపీటీసీ అభ్యర్థి మృతి

    తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య(28) శుక్రవారం మృతి చెందారు. రేపు ఫలితాలు రానుండగా ముందు రోజే ఆమె ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

  • 6 Nov 2026, 09:09:45 PM IST

    ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్

    శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

  • 6 Nov 2026, 07:55:18 PM IST

    పటిష్ఠ ఏర్పాట్లు

    కౌటింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. దాదాపు 30 వేల మందికిపైగా సిబ్బందిని వినియోగిస్తోంది. లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.

  • 6 Nov 2026, 07:54:21 PM IST

    తొలుత పోస్టల్ బ్యాలెట్ల్ ఓట్లు…

    రాష్ట్రవ్యాప్తంగా 9 వేలకుపైగా కౌంటింగ్ టేబుల్స్‌ సిద్ధం చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల్ని ఉదయాన్నే కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులు తెరుస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లు వేరు చేసి ట్రేలలో వేస్తారు. ఆ తర్వాతే అసలు లెక్కింపు ప్రారంభం అవుతుంది.

  • 6 Nov 2026, 07:53:54 PM IST

    365 కౌంటింగ్ కేంద్రాలు

    ఏకగ్రీవాలు పోనూ 582 జట్పీడీసీలు, 7767 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. ఆయా జిల్లాల్లో ఉన్న స్థానాలను బట్టి 28 జిల్లాల పరిధిలో 365 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

  • 6 Nov 2026, 07:53:38 PM IST

    రాత్రికల్లా పూర్తి ఫలితాలు

    ప్రాథమిక అంచనాల ప్రకారం…. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఎంపీటీసీ, రాత్రి 7 గంటలకల్లా జడ్పీటీసీ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

  • 6 Nov 2026, 07:47:49 PM IST

    ఓటింగ్ శాతం గణాంకాలు

    విశాఖ జిల్లాలో నాలుగు జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. అత్యధికంగా 82.51శాతం, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 62.01 శాతం పోలింగ్‌ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 65.51, అనకాపల్లి 75.58, అనంతపురం 64.38, అన్నమయ్య 69.19, చిత్తూరు 76.30, బాపట్ల 67.47, కృష్ణా జిల్లా 73.21, కోనసీమ జిల్లాలో 66.33 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

  • 6 Nov 2026, 07:47:26 PM IST

    పోలింగ్ శాతం ఎంతంటే..

    ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 70.72శాతం పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరగ్గా.. తుది పోలింగ్‌ శాతాన్ని ఎస్‌ఈసీ ఇవాళ ప్రకటించింది.

  • 6 Nov 2026, 07:46:06 PM IST

    ముగిసిన రీపోలింగ్

    వర్షాలు, వరదల కారణంగా పోలింగ్ వాయిదా పడిన 5 మండలాల్లోనూ ఇవాళ జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వీటితో పాటు వివిధ సాంకేతిక, ఇతర కారణాల వల్ల మరో మూడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన పునఃపోలింగ్ ప్రక్రియ కూడా సాయంత్రం 5 గంటలకు విజయవంతంగా పూర్తయింది.

  • 6 Nov 2026, 07:45:49 PM IST

    తరలివచ్చిన ఓటర్లు

    ఈ నెల 5న జరిగిన పరిషత్ పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 70.72 శాతం ఓటింగ్ నమోదు కావడం గ్రామీణ ఓటర్లలో పెరిగిన రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది.

  • 6 Nov 2026, 07:45:24 PM IST

    ముందుగా పోస్టల్ బ్యాలెట్…

    ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. బ్యాలెట్ పత్రాల ఆధారంగా సాగే కౌంటింగ్ కావడం వల్ల తొలి అధికారిక ఫలితం వెలువడటానికి కనీసం నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • 6 Nov 2026, 07:45:11 PM IST

    365 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం

    రాష్ట్ర వ్యాప్తంగా 365 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదేశాల మేరకు దాదాపు 30 వేల మందికి పైగా సిబ్బంది ప్రత్యక్షంగా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొననున్నారు. వీరిలో 11 వేలకు పైగా కౌంటింగ్ సూపర్‌వైజర్లు కాగా, మరొక 28,500 మంది కౌంటింగ్ సిబ్బంది, సహాయకులు విధులు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 6 Nov 2026, 07:43:58 PM IST

    రేపు పరిషత్ కౌంటింగ్

    ఏపీలో పరిషత్ పోరు ముగిసింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీపడ్డ వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks