AP PGCET 2026 Counseling : ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - కీలకమైన తేదీలివే

AP PGCET 2026 Counseling Notification : ఆంధ్రప్రదేశ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు APPGCET-2026 వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 3 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

Published on: Sep 2, 2026, 05:12:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP PGCET 2026 Counseling Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఏపీ పీజీసెట్ 2026' వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఏపీ పీజీసెట్ 2026 అడ్మిషన్లు - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీ పీజీసెట్ 2026 అడ్మిషన్లు - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

AP PGCET-2026 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన ర్యాంకర్లు, అలాగే ఆయా యూనివర్సిటీలు నిర్ణయించిన విద్యార్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని అనుబంధ, కాన్స్టిట్యూెంట్ కళాశాలలు, అలాగే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్న ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, తదితర పీజీ ప్రోగ్రామ్‌లలో సీట్ల కేటాయింపు కోసం ఈ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

ముఖ్య తేదీలు :

  • రిజిస్ట్రేషన్ తేదీలు : 2026 సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 8 వరకు విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
  • సర్టిఫికేషన్ పరిశీలన : ఆన్‌లైన్ నమోదు సమయంలోనే అభ్యర్థులు తమ అసలు ధ్రువపత్రాల డిజిటల్ ప్రతిలను అప్‌లోడ్ చేసి ధృవీకరించుకోవాలి.
  • అధికారిక వెబ్‌సైట్ : పూర్తిస్థాయి సమగ్ర నోటిఫికేషన్, కౌన్సెలింగ్ గైడ్‌లైన్స్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం విద్యార్థులు [ https://ceo.apcfss.in ] ( https://ceo.apcfss.in ) పోర్టల్‌ను సందర్శించాలి.

విద్యా సంవత్సరంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా వేగంగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా తొలి రోజు నుంచే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More