AP PGCET 2026 Counseling : ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
AP PGCET 2026 Counseling : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారు. అర్హులైన విద్యార్థులు…. ఈ నెల 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
AP PGCET 2026 Counseling : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఏపీ పీజీసెట్ 2026' (AP PGCET) మొదటి విడత ఆన్‌లైన్ వెబ్ కౌన్సెలింగ్ గడువును అధికారులు పొడిగించారు.

రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు….
తాజా నిర్ణయం ప్రకారం…. అర్హులైన వాళ్లు ఈ నెల 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మొదట ప్రకటించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8వ తేదీతోనే రిజిస్ట్రేషన్ గడువు ముగియాల్సి ఉంది. అయితే, వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ గడువును పొడిగించారు.
అభ్యర్థుల సౌకర్యార్థం కౌన్సెలింగ్ ప్రక్రియలో మరికొన్ని సడలింపులు కూడా ఇచ్చారు. ఈ నెల 11, 12 తేదీల్లో విద్యార్థులు ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు వెబ్ ఐచ్ఛికాలను కూడా నమోదు చేసుకునే వెసులుబాటును కల్పించారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే తమ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
సెప్టెంబర్ 16, 2026న ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. సెప్టెంబర్ 21, 2026న కేటాయించిన సీట్ల వివరాలను ప్రకటిస్తారు. సీటు సాధించిన విద్యార్థులు సెప్టెంబర్ 21 నుండి సెప్టెంబర్ 22 వరకు సంబంధిత కాలేజీల్లో నివేదించాల్సి ఉంటుంది.సెప్టెంబర్ 21, 2026 నుండి కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.
అభ్యర్థులు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇక పీజీసెట్ లో సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మొదటి విడత పూర్తి అయిన తర్వాత… మరో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలవుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

