...
...
Next Story

AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిసెట్ 2026 కౌన్సెలింగ్ అప్డేట్ - ఇవాళ్టితో స్లాట్ బుకింగ్ క్లోజ్..!

AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిసెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (స్లాట్ బుకింగ్) ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. జూలై 3 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉండగా, జూలై 6న సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల కానున్నాయి.

Published on: Jun 30, 2026, 10:22:23 IST
Advertisement

AP POLYCET 2026 Counselling : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'ఏపీ పాలిసెట్ 2026' మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న మొదటి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ మరియు ఫీజు చెల్లింపు ప్రక్రియ ఇవాళ్టితో (30.06.2026) ముగియనుంది. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు & సర్టిఫికెట్ల పరిశీలన: 30.06.2026 (ఇవాళే ఆఖరి తేదీ)
  • హెల్ప్ లైన్ కేంద్రాలలో ధ్రువపత్రాల పరిశీలన: ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ పూర్తికాని వారు లేదా తమ దరఖాస్తు డేటాలో ఏవైనా మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు జూలై 1, 2026 (01.07.2026) వరకు తమకు సమీపంలోని హెల్ప్ లైన్ సెంటర్లను (HLC) నేరుగా సంప్రదించవచ్చు.
  • వెబ్ ఆప్షన్ల నమోదు : అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, బ్రాంచ్‌లను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకునేందుకు జూలై 3, 2026 (03.07.2026) వరకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
  • వెబ్ ఆప్షన్ల సవరణ : ఇప్పటికే నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేయాలనుకుంటే జూలై 4, 2026 (04.07.2026) న మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు.
  • సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్) : అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్లు మరియు వెబ్ ఆప్షన్ల ఆధారంగా జూలై 6, 2026 (06.07.2026) న సాయంత్రం 6 గంటల తర్వాత మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.
  • కాలేజీల్లో రిపోర్టింగ్: సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 7, 2026 నుండి జూలై 10, 2026 లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు, తమకు కేటాయించిన కాలేజీకి వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
  • తరగతుల ప్రారంభం : మొదటి విడతలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు జూలై 7, 2026 (07.07.2026) నుంచి కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయి.

ఏపీ పాలిసెట్ 2026
ఏపీ పాలిసెట్ 2026
 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe