AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలు ఇవే!
AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిసెట్ 2026 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతి విద్యాశాఖ విడుదల చేసింది. జూలై 16 నుంచి రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
AP POLYCET 2026 Counselling : ఆంధ్రప్రదేశ్‌లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మొదటి విడతలో సీటు రాని వారు, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు ఈ విడతలో పాల్గొనడానికి అర్హులు.

పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు :
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన, ఫీజు చెల్లింపు: జూలై 16, 2026 నుండి జూలై 18, 2026 వరకు
- సహాయ కేంద్రాల్లో (HLC) సర్టిఫికెట్ల పరిశీలన: జూలై 16, 2026 నుండి జూలై 19, 2026 వరకు (ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ కాని వారు లేదా మార్పులు ఉన్నవారి కోసం)
- వెబ్ ఆప్షన్ల నమోదు: జూలై 16, 2026 నుండి జూలై 20, 2026 వరకు
- వెబ్ ఆప్షన్ల మార్పు: జూలై 21, 2026
- సీట్ల కేటాయింపు: జూలై 24, 2026 (సాయంత్రం 6 గంటల తర్వాత)
- కళాశాలల్లో రిపోర్టింగ్, సెల్ఫ్ జాయినింగ్: జూలై 25, 2026 నుండి జూలై 29, 2026 వరకు
రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఓసీ (OC), బీసీ (BC) అభ్యర్థులు రూ. 700 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ (SC), ఎస్టీ (ST) అభ్యర్థులు రూ. 250 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడతలోనే ఫీజు కట్టిన వారు ఈ విడతలో మళ్లీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల పేమెంట్ ఫెయిల్ అయితే…. వారం రోజుల్లో ఆ సొమ్ము ఖాతాలోకి రీఫండ్ అవుతుందని కన్వీనర్ తెలిపారు.
మొదటి విడతలో పెట్టిన వెబ్ ఆప్షన్లను ఈ విడతలో పరిగణించరు. కాబట్టి ప్రతీ ఒక్కరూ మొబైల్ ఓటీపీ (OTP) ద్వారా లాగిన్ అయి కొత్తగా ఆప్షన్లు ఇచ్చుకోవాలి. "ఈ తుది విడతలో కొత్తగా ఆప్షన్లు ఇచ్చుకుని సీటు పొందితే, మొదటి విడతలో వచ్చిన సీటు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది," అని పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ స్పష్టం చేశారు. అందువల్ల విద్యార్థులు కళాశాలల ప్రాధాన్యతను కాగితంపై రాసుకుని, జాగ్రత్తగా ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. జూలై 1, 2026 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 24 ఏళ్లు, ఓసీ అభ్యర్థులకు 20 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఉన్నవారే దీనికి అర్హులు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 హెల్ప్ లైన్ కేంద్రాల జాబితా కోసం అధికారిక వెబ్‌సైట్ https://polycet.ap.gov.in ను సందర్శించవచ్చు లేదా హెల్ప్ డెస్క్ నంబర్లకు 7842075469, 7842085469 కాల్ చేయవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

