...
...
Next Story

AP SET Results : ఏపీ సెట్ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

AP SET Results : ఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2,143 మంది అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించారు. ఫలితాలు, కటాఫ్ మార్కులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Published on: Jun 5, 2026, 09:30:16 IST
Advertisement

AP SET Results : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలిజిబిలిటీ టెస్ట్ (APSET) ఫలితాలు వచ్చేశాయి. ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఇటీవల జారీ చేసిన తాజా మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ ఈసారి ఫలితాలను రూపొందించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఏపీ సెట్ ఫలితాలు
ఏపీ సెట్ ఫలితాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లేదా లెక్చరర్‌ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే ఈ ఏపీ సెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఈ ఏడాది మార్చి 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 సబ్జెక్టులకు గాను ఈ పరీక్షను నిర్వహించారు.

ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,075 మంది అభ్యర్థులు హాజరుకాగా…. వారిలో కేవలం 2,143 మంది మాత్రమే అర్హత సాధించగలిగారు. ఈ ఫలితాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన వారిలో 1,016 మంది పురుషులు ఉండగా, 1,127 మంది మహిళలు ఉన్నారు.

పరీక్షకు హాజరైన అభ్యర్థుల సౌకర్యార్థం అర్హత పొందిన వారి రిజిస్ట్రేషన్ నంబర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సబ్జెక్టుల వారీగా, వివిధ సామాజిక వర్గాల (కేటగిరీలు) వారీగా కేటాయించిన కట్‌ ఆఫ్‌ మార్కుల పూర్తి వివరాలను కూడా ఏపీసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు.

ఏపీ సెట్ కేవలం ఒక అర్హత పరీక్ష మాత్రమేనని అధికారులు గుర్తు చేశారు. భవిష్యత్తులో వివిధ విద్యాసంస్థల్లో ఉద్యోగ నియామకాలు జరిపే సమయంలో, సదరు నియామక సంస్థలు లేదా యాజమాన్యాలు అభ్యర్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాలను, రికార్డులను తప్పనిసరిగా క్షుణ్ణంగా పరిశీలించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు సూచించారు.

ఏపీ సెట్ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

  • అభ్యర్థులు https://apset.aptonline.in/APSET/ వెబ్ సైట్ ను సంప్రదించాలి.
  • హోం పేజీలోని ఏపీ సెట్ రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ ఉత్తీర్ణత సాధించిన రిజిస్ట్రేషన్ నెంబర్లతో కూడిన పీడీఎప్ ఉంటుంది.
  • ఇందులో మీ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe