...
...
Next Story

AP SSC Exams 2026 : ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - ఎగ్జామ్ ఫీజు తేదీలు వచ్చేశాయ్

ఏపీ టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ వచ్చేసింది. నవంబరు 13 నుంచి 25 వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు. రూ.50 ఫైన్ తో నవంబరు 26 నుంచి డిసెంబరు 3 అవకాశం ఉంటుంది. ఇక రూ.500 ఫైన్ తో డిసెంబరు 11 నుంచి 15 వరకు చెల్లించవచ్చు.

Published on: Nov 12, 2025 01:29 PM IST
Advertisement

ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. తాజాగా వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల విభాగం విడుదల చేసి ప్రకటనలోని వివరాల ప్రకారం…. నవంబరు 13 నుంచి విద్యార్ధులు పరీక్షల ఫీజు చెల్లించవచ్చు. రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు గతంలో పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు, ఒకేషనల్‌ విద్యార్థులు కూడా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 25వ తేదీ వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించారు.

ఫైన్ తో ఎప్పటివరకంటే…?

ఏపీ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్
ఏపీ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్

ఇక రూ.50 ఆలస్య రుసుముతో నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించుకోవచ్చు. ఈ తేదీ కూడా దాటితే రూ.200 ఫైన్ తో డిసెంబరు 4 నుంచి 10 వరకు, రూ.500 ఫైన్ తో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 చెల్లించాలి. ఫెయిన్ అయిన విద్యార్థులు 3 పేపర్ల కంటే ఎక్కువ రాస్తే రూ. 125, మూడు పేపర్ల లోపు అయితే రూ. 110 చెల్లించాలి. వొకేషనల్ విద్యార్థులు అయితే అదనంగా రూ. 60, విద్యార్థి వయసు విషయంలో తేడాలుంటే రూ. 300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

వార్షిక పరీక్షల ఫీజును https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది చివరిలో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే సర్వర్‌ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ముందుగానే ఫీజులు చెల్లించుకోవాలని సూచిస్తున్నారు.

మరోవైపు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. అయితే మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఆ వెంటనే షెడ్యూల్ కూడా విడుదలవుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe