AP SSC Results 2026 Live :పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇదిగో డైరెక్ట్ లింక్
AP SSC Results 2026 Live Updates : ఏపీలో పదో తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు రిజల్ట్ విడుదల కానున్నాయి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.
Andhra Pradesh SSC Results 2026 Live Updates : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు 2026 విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. వాట్సాప్‌లో AP 10th Class Results చూసుకోవచ్చు.

AP 10th Class Results Live Updates : మార్చి 2026లో జరిగిన సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు గురువారం (ఏప్రిల్ 30, 2026) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.
- {{^htLoading}}
{{/htLoading}}
- 30 Apr 2026, 10:37:39 AM IST
ధైర్యంగా ఉండాలి
పదో తరగతి ఫలితాలు విద్యార్థి భవిష్యత్తుకు తొలి కీలక మెట్టు. విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ, తక్కువ మార్కులు వచ్చిన వారు ధైర్యంగా తదుపరి లక్ష్యాలపై దృష్టి సారించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
- 30 Apr 2026, 09:53:43 AM IST
మరికొన్ని క్షణాల్లో పదో తరగతి ఫలితాలు
మరికొన్ని క్షణాల్లో పదో తరగతి ఫలితాలు విడుదల అవుతాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుల లాగిన్లలో ఆయా పాఠశాల విద్యార్థుల ఫలితాలు చూసుకోవచ్చు. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు 6.38లక్షల మంది ఈ ఏడాది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. 6.3లక్షల మంది పరీక్షలు రాశారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 30 Apr 2026, 08:24:07 AM IST
ఏపీ పదో తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల మరికొన్ని నిమిషాల్లో విడుదల కానున్నాయి. ఇక్కడ ఉన్న డైరెక్ట్ లింక్ క్లిక్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. https://results.bse.ap.gov.in/
- 30 Apr 2026, 07:06:16 AM IST
ఫలితాల ప్రకటన తర్వాత రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్
ఫలితాల ప్రకటన తర్వాత రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్‌ను ఫలితాల రోజే విద్యాశాఖ విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ షెడ్యూల్ ను కూడా నేడే ప్రకటించే అవకాశం ఉంటుంది.
- {{^htLoading}}
{{/htLoading}} - 30 Apr 2026, 06:30:24 AM IST
వాట్సాప్ లో ఏపీ టెన్త్ ఫలితాలు…
మీ మొబైల్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేయండి.
వాట్సాప్‌లో ఈ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
మెనూలో 'Education Services' ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఆ తర్వాత 'Download SSC Results' పై క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నంబర్ ఇస్తే చాలు. మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.
- 30 Apr 2026, 05:55:34 AM IST
ట్యాబ్‌లో ఎంట్రీ
రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో చేపట్టిన మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 15తో ముగిసింది. ఎస్‌వోలు, సీఎస్‌లు, క్యాంపు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే మార్కులను మాన్యువుల్‌తో పాటు ట్యాబ్‌ల్లోనూ నమోదు చేశారు. మార్కుల లెక్కింపులో పొరపాటు లేకుండా ఉండేందుకు ఈ ఏడాది ట్యాబ్‌లను తీసుకొచ్చారు. మొదట్లో ట్యాబ్ లో ఎంట్రీ చేసే క్రమంలో కొంత జాప్యం జరిగినప్పటికీ… చివరగా ఈ ప్రక్రియ కూడా పూర్తి అయింది. సాంకేతిక ప్రక్రియను, కోడింగ్, డీకోడింగ్ సాంకేతిక పనులను కూడా వేగంగా పూర్తి చేశారు. దీంతో త్వరగానే ఫలితాలను సిద్ధం చేశారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 30 Apr 2026, 05:14:55 AM IST
మరికాసేపట్లో పది ఫలితాలు
నేటి ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు.
- 29 Apr 2026, 10:19:07 PM IST
ఏపీ పదో తరగతి ఫలితాలు ఇలా చూడొచ్చు
SSC ఫలితాల పోర్టల్: https://results.bse.ap.gov.in/
మన మిత్ర WhatsApp: 9552300009 నంబర్‌కు "Hi" అని పంపండి
LEAP మొబైల్ యాప్ (విద్యార్థుల కోసం కూడా)
- {{^htLoading}}
{{/htLoading}} - 29 Apr 2026, 10:18:07 PM IST
కిందటి ఏడాది ఉత్తీర్ణత శాతం ఇలా
2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 81.14 శాతం ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసింది. బాలికలు బాలుర కంటే 5.78 శాతం పాయింట్ల అధిక ఉత్తీర్ణతను సాధించి మెరుగైన ఫలితాలను చూపించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 84.09 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 78.31 శాతంగా నమోదైంది. ఆ సంవత్సరంలో మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ప్రధాన పరీక్షలో అన్ని పేపర్లను ఉత్తీర్ణం కాలేకపోయిన విద్యార్థుల కోసం, ఈ సంవత్సరం కూడా త్వరగానే సప్లీ పరీక్షలు పెడతారు.
- 29 Apr 2026, 10:17:18 PM IST
మొత్తం 6,29,109 మంది విద్యార్థులు
SSC పరీక్షలు మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్ 1న ముగిశాయి. పరీక్షలకు నమోదు చేసుకున్న మొత్తం 6,29,109 మంది అభ్యర్థులలో మొదటి రోజున 6,22,217 మంది హాజరయ్యారు. అంటే 98.90 శాతం హాజరు శాతాన్ని సూచిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 3,415 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 29 Apr 2026, 10:16:43 PM IST
పాఠశాల లాగిన్‌లో డౌన్లోడ్
ఫలితాలు విడుదలైన వెంటనే, ప్రధానోపాధ్యాయులు తమ సంబంధిత పాఠశాల లాగిన్‌ల ద్వారా ఫలితాలను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తమ లక్ష్యాలను సాధించిన విద్యార్థులకు లోకేశ్ అభినందనలు తెలిపారు. పరీక్షా ఫలితాలు అనేవి విద్యా ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమే అని పేర్కొంటూ, విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని సూచించారు.
- 29 Apr 2026, 10:15:54 PM IST
నారా లోకేశ్ ట్వీట్
'విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక SSC ఫలితాల పోర్టల్ results.bse.ap.gov.in ద్వారా, 9552300009 నంబర్‌కు 'Hi' అని సందేశం పంపడం ద్వారా 'మన మిత్ర' WhatsApp సేవ ద్వారా, LEAP మొబైల్ అప్లికేషన్ (విద్యార్థుల కోసం కూడా అందుబాటులో ఉంది) ద్వారా, DigiLocker ప్లాట్‌ఫారమ్ ద్వారా పొందవచ్చు.' అని నారా లోకేశ్ చెప్పారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 29 Apr 2026, 10:14:51 PM IST
ఉదయం 11 గంటలకు ఫలితాలు
మార్చి 2026లో జరిగిన సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు గురువారం (ఏప్రిల్ 30, 2026) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.