ఏపీ తెలంగాణ వెదర్ రిపోర్ట్ : మరో 4 రోజులు భారీ వర్షాలు - ఈ 9 జిల్లాలకు 'ఆరెంజ్' హెచ్చరికలు

ఏపీ, తెలంగాణకు మరోసారి ఐఎండీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. మరో మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. 

Published on: Jul 20, 2025 12:34 PM IST
By , , Andhrapradesh, Telangana
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారుతున్నాయి. గత కొన్నిరోజులుగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన
ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన

మరోవైపు బంగాళాఖాతంలో ఈనెల 24వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో రాబోయే మూడు నాలుగు రోజులు భారీ వర్షాలుపడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉంది.

ఇవాళ(జూలై 20)అల్లూరి సీతారామరాజు,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, సత్యసాయి,కడప,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. తీర ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణకు భారీ వర్ష సూచన - ఆరెంజ్ అలర్ట్

తెలంగాణలోనూ మరో మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం… భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన వానలు పడొచ్చు.

రేపు(జూలై 21) రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. అయితే మహబూబాబాద్, వరరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలుపడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఇక హైదరాబాద్ నగరంలో ఇవాళ మోస్తారు వర్షం పడొచ్చు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడన వానలు పడే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More