...
...
Next Story

AP TET 2026 Exams Schedule : ఏపీ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - ఏ పేపర్ ఎప్పుడంటే…?

AP TET 2026 Exams Schedule : ఆంధ్రప్రదేశ్‌ టెట్ పరీక్షల తేదీలు, షిఫ్టుల వివరాలతో కూడిన పూర్తి టైమ్‌టేబుల్‌ను విద్యా శాఖ విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి 16 వరకు పరీక్షలు జరగనున్నాయి.

Published on: Jul 27, 2026, 05:12:27 IST
Advertisement

AP TET 2026 Exams Schedule : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026) రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ ముఖ్యమైన అప్డేట్ అందించింది. టెట్ పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

ఏపీ టెట్ పరీక్షల షెడ్యూల్
ఏపీ టెట్ పరీక్షల షెడ్యూల్

షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగస్టు 5, 2026 నుంచి ప్రారంభమై ఆగస్టు 16, 2026 వరకు కొనసాగుతాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్/కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఏపీ టెట్ పరీక్షలు - షెడ్యూల్ ఇలా:

ప్రతిరోజూ మొదటి షిఫ్ట్ ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతుంది. అలాగే రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 02:30 గంటల నుంచి సాయంత్రం 05:00 గంటల వరకు ఉంటుంది.

  • ఆగస్టు 5న ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లోనూ పేపర్ 2ఏ లాంగ్వేజ్ తెలుగు పరీక్ష జరుగుతుంది.
  • ఆగస్టు 6న ఉదయం షిఫ్ట్‌లో పేపర్ 2A లాంగ్వేజెస్ (కన్నడ, ఒరియా, తమిళం, సంస్కృతం, ఉర్దూ) పరీక్షలు ఉంటాయి. అదే రోజు మధ్యాహ్నం షిఫ్ట్ నుంచి పేపర్ IA తెలుగు పరీక్షలు ప్రారంభమవుతాయి.
  • ఆగస్టు 6 మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే పేపర్ IA తెలుగు పరీక్షలు ఆగస్టు 7, 8, 9 తేదీల్లో ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లోనూ జరుగుతాయి. ఆగస్టు 9 మధ్యాహ్నం షిఫ్ట్‌లో పేపర్ IA మైనర్ మీడియం పరీక్ష కూడా ఉంటుంది.
  • ఆగస్టు 10న ఉదయం షిఫ్ట్‌లో పేపర్ IA తెలుగు, పేపర్ IB తెలుగు మరియు పేపర్ IB మైనర్ మీడియం పరీక్షలను నిర్వహిస్తారు.
  • ఆగస్టు 10 మధ్యాహ్నం షిఫ్ట్ నుంచి సోషల్ స్టడీస్ అభ్యర్థులకు పరీక్షలు మొదలవుతాయి. ఇదే రోజు మధ్యాహ్నం పేపర్ IIA సోషల్ మరియు సోషల్ మైనర్ మీడియం పరీక్ష ఉంటుంది.
  • అనంతరం ఆగస్టు 11న ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లోనూ పేపర్ IIA సోషల్ పరీక్షలు కొనసాగుతాయి.
  • ఆగస్టు 12న ఉదయం షిఫ్ట్‌లో పేపర్ IIA లాంగ్వేజ్ హిందీ పరీక్ష నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం షిఫ్ట్‌లో పేపర్ IIB, పేపర్ IIB మైనర్ మీడియం మరియు పేపర్ IIA మ్యాథ్స్ & సైన్స్ పరీక్షలు మొదలవుతాయి
  • మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులకు ఆగస్టు 13, 14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లోనూ పేపర్ IIA మ్యాథ్స్ & సైన్స్ పరీక్షలు ఉంటాయి.
  • చివరి రోజున అంటే ఆగస్టు 16న ఉదయం షిఫ్ట్‌లో పేపర్ IIA మ్యాథ్స్ & సైన్స్ మరియు మ్యాథ్స్ & సైన్స్ మైనర్ మీడియం పరీక్షలను నిర్వహిస్తారు. మధ్యాహ్నం షిఫ్ట్‌లో పేపర్ IIA లాంగ్వేజ్ ఇంగ్లీష్ పరీక్షతో ఈ టెట్ పరీక్షల ప్రక్రియ ముగుస్తుంది.

ఏపీ టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ ఇలా :

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/ ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP TET హాల్ టికెట్ 2026 లింక్‌పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు క్యాండిడేట్ లాగిన్‌ మీద క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి.
  • యూజర్ నేమ్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌లను ఎంటర్ చేయాలి.
  • సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి, మీ అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
  • అడ్మిట్ కార్డును తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాతి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచుకోండి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe