AP TET 2025 : కొనసాగుతున్న ఏపీ టెట్ పరీక్షలు - 'కీ' విడుదలపై అప్డేట్ ఇదిగో
ఏపీ టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 21వ తేదీతో అన్ని సబ్జెక్టుల పేపర్లు పూర్తవుతాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు జనవరి 2వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి.
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ డిసెంబర్–2025) పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కాగా…. ఈనెల 21వ తేదీతో అన్ని పేపర్లు పూర్తవుతాయి.

ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటలు ఒక సెషన్ ఉండగా.., మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగుతున్న టెట్ పరీక్షల కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొందరు పేపర్ 1తో పాటు పేపర్ 2 కు కూడా అప్లయ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసారి టెట్‌కు 32 వేల మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా కూడా పరీక్షలు రాస్తున్నారు.
ప్రాథమిక కీలు ఎప్పుడంటే…?
వచ్చే ఏడాది జనవరి 2వ తేదీన ఏపీ టెట్ ఎగ్జామ్స్ ప్రాథమిక కీలు విడుదలవుతాయి.జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 13వ తేదీన ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకువస్తారు. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. జననవరి 19వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను ప్రకటిస్తారు.
టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి చేశారు. కాబట్టి టెట్ లో మంచి స్కోర్ సాధించేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతుంటారు. ఇందులో సాధించే స్కోర్… డీఎస్సీలో వెయిటేజీగా తీసుకుంటారు.
మరోవైపు ఏపీ టెట్ కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ ఈ అవకాశాన్ని కల్పించింది. https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవటంతో పాటు మాక్ టెస్టులు కూడా రాసుకోవచ్చు.
ఏపీ టెట్ ప్రాథమిక కీలతో పాటు ఫలితాలను కూడా https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోనే అందుబాటులో ఉంటాయి. కీలపై ఉండే అభ్యంతరాలను కూడా ఇదే వెబ్ సైట్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

