రాజధాని నిర్మాణం కోసం మరో 16 వేల ఎకరాల భూసేకరణ - ముఖ్యమైన 10 అంశాలు
రాజధాని విస్తరణ కోసం మలివిడత ల్యాండ్ పూలింగ్ కు ఏపీ సర్కార్ సిద్ధమైంది.16,666.56 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. అమరావతి,తుళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల్లో పూలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
రాజధాని అమరావతి విస్తరణ కోసం మలివిడత ల్యాండ్ పూలింగ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఇందుకు ఆమోదముద్ర పడింది. రెండో విడత లో మొత్తం ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటారు.

ముఖ్యమైన విషయాలు…
- రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి రెండో విడతలో 16,666.57 ఎకరాల భూములను సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు,రైల్వే ట్రాక్,రైల్వే స్టేషన్,ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటికి సంబంధించి 16,666.56 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటారు.
- వైకుంఠపురం,పెదమద్దూరు,ఎండ్రాయి,కర్లపూడి లో 7,562 ఎకరాలు,వడ్డమాను,హరిశ్చంద్రపురం,పెదపరిమిలో 9,104.57 ఎకరాలు కలిపి మొత్తం 16,666 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తారు.
- ఇదికాకుండా ప్రభుత్వ భూమి మరో 3,828 ఎకరాలు ఉంది. వీటిలో ఎక్కువగా కొండలు ఉన్నాయి.ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన రైతులకు గతంలో ఇచ్చిన విధంగానే నిబంధనలు అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.
- జరీబు భూమికి నివాస ప్లాటు 1000చదరపు గజాలు,వాణిజ్య ప్లాటు 450చ.గ,మెట్ట భూములకు నివాస ప్లాటు 1000చ.గ,వాణిజ్య ప్లాటు 250 ,చదరపు గజాలు కేటాయిస్తారు.
- కౌలు కూడా గతంలో మాదిరిగానే చెల్లిస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పంపించిన తీర్మానాలను కేబినెట్ ఆమోదించినట్లు చెప్పారు.
- గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు మాత్రమే కేటాయించారు. అయితే ఒలింపిక్ వంటి ఇంటర్నేషనల్ క్రీడలు నిర్వహించాలంటే 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
- గతంలో భూములిచ్చిన రైతులందరికీ ప్లాట్లు ఇచ్చామని...అయితే కొన్ని చోట్ల జరీబు - నాన్ జరీబు సమస్యతో పాటు రోడ్డు శూల,గ్రామ కంఠాల భూమలు అంశంపై రైతులతో మాట్లాడుతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.
- గ్రామ కంఠాల విషయంలో ఎవరికైనా పొరపాటున ఎక్కువ భూమి ఇచ్చి ఉంటే వెనక్కి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నెలరోజుల్లోగా ఆయా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
- మరోవైపు అసైన్డ్ రైతుల సమస్యను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుంది. ఇక రైతుల రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుందని మంత్రి నారాయణ తాజాగా ప్రకటించారు.
స్మార్ట్ ఇండస్ట్రీలు తప్పనిసరి - మంత్రి నారాయణ
రాజధానిలో రాబోయే 30 ఏళ్లకు సరిపడా ప్రజల జీవన స్థితి ఉండేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి నారాయణ చెప్పారు.అమరావతి రాజధానిలో ప్రస్తుతం ఉన్న భూముల రేట్లు పెరగాలన్నా....గ్రోత్ రేట్ పెరగాలన్నా ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీలు తప్పనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లేనిదే ఈ ప్రాంతం అభివృద్ది చెందదని… అందుకే 500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

