APPSC Group 1 Results : ఏపీ గ్రూప్‌ -1 ఫలితాలు విడుదల - లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి

ఏపీ గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 87 ఉద్యోగాల నియామకాల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్ లో రిజల్ట్ జాబితాను చెక్ చేసుకోవచ్చు.

Published on: Jan 30, 2026, 23:46:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ గ్రూప్ 1 తుది ఫలితాలు వచ్చేశాయి. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా 87 పోస్టులను భర్తీ చేశారు. ఇందుకు సంబంధించిన జాబితాను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది.

గ్రూప్‌-1 తుది ఎంపిక జాబితా విడుదల
గ్రూప్‌-1 తుది ఎంపిక జాబితా విడుదల

వివిధ కేటగిరీల్లో పోస్టులకు ప్రాథమికంగా ఎంపిక చేసిన వారి హాల్‌టికెట్‌ నంబర్లతో కూడిన జాబితాను వెబ్ సైట్ లో పొందుపరిచింది. ఈ జాబితాను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.

ఏపీ గ్రూప్ 1 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

  1. అభ్యర్థులు https://portal-psc.ap.gov.in/Default వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. గ్రూప్ 1 సెలక్షన్ లిస్ట్ పై క్లిక్ చేయాలి.
  3. హాల్ టికెట్ నెంబర్ తో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  4. ఇందులో ఎంపికైన వారి హాల్ టికెట్లు ఉంటాయి.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందవచ్చు.

ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 2023 డిసెంబరు 8న ప్రకటన విడుదల చేసింది. 2024 మార్చిలో ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించగా… 2025 మే నెలలో మెయిన్స్ పరీక్షలను పూర్తి చేశారు. జూన్ లో నుంచి జూలై వరకు ఇంటర్వ్యూలు నిర్వహించగా… ఇవాళ తుది ఫలితాలను ప్రకటించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More