APPSC : థానేదార్, లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
APPSC : థానేదార్, లెక్చరర్ పోస్టులకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వీటిని చూసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని థానేదార్ పోస్టులకు సంబంధించి వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్షలకు తాత్కాలికంగా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని లెక్చరర్ పోస్టులకు సంబంధించి మూడు సబ్జెక్టులకు సంబంధించిన తాత్కాలిక ఎంపిక ఫలితాలను కూడా ప్రకటించింది.

కమిషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 9, 2025 నాటి నోటిఫికేషన్ నంబర్ 13/2025 ద్వారా చేపట్టిన థానేదార్ నియామక ప్రక్రియలో, తదుపరి దశకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచారు.
ఫిబ్రవరి 9, 2026న (ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో), ఫిబ్రవరి 10, 2026న (మధ్యాహ్నం సెషన్‌లో) ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి 13 జిల్లాల్లో నిర్వహించిన రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్షలకు సంబంధించిన తేదీలు, సమయాలు, వేదికల వివరాలను అర్హులైన అభ్యర్థులకు విడిగా తెలియజేస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది.
మరో ప్రకటనలో డిసెంబర్ 30, 2023 నాటి నోటిఫికేషన్ నంబర్ 17/2023 ద్వారా చేపట్టిన ఏపీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీస్ (జనరల్ రిక్రూట్‌మెంట్) పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
కామర్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అనే మూడు సబ్జెక్టులకు సంబంధించిన తాత్కాలిక ఎంపిక జాబితాలు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన రెండు సబ్జెక్టులకు సంబంధించిన ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామని కమిషన్ తెలిపింది.
అభ్యర్థులు తాజా జాబితాలను చూసేందుకు, నియామక ప్రక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


