...
...
Next Story

APPSC Recruitment : 892 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల - దరఖాస్తు తేదీలు, ఖాళీల పూర్తి వివరాలివే

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ అయ్యాయి.మొత్తం 892 ఖాళీలున్నాయి. అక్టోబర్ 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఇందులో 163 గ్రూప్‌-1 ఖాళీలున్నాయి.

Published on: Sep 15, 2026, 11:21:40 IST
Advertisement

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసింది. మొత్తం 892 ఉద్యోగాల భర్తీకి సంబంధించి సంక్షిప్త నోటిఫికేషన్లను వెబ్ సైట్ లో ఉంచుంది.

ఏపీపీఎస్సీ ఉద్యోగ ప్రకటనలు
ఏపీపీఎస్సీ ఉద్యోగ ప్రకటనలు

గ్రూప్-1 నుంచి పర్యావరణ ఇంజినీర్లు, అటవీ శాఖ పోస్టుల వరకు పలు విభాగాలకు చెందిన ఉద్యోగ ప్రకటనలు ఇందులో ఉన్నాయి. ఏపీపీఎస్సీ ప్రకటించిన వివరాల ప్రకారం అభ్యర్థులు https://psc.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వేర్వేరు పోస్టులకు సంబంధించి అక్టోబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు ప్రక్రియలు ప్రారంభమవుతాయి.

ముఖ్యమైన పోస్టులు - ఖాళీల వివరాలు

  • గ్రూప్-1 సర్వీసెస్ : మొత్తం 163 ఖాళీలు ఉన్నాయి.
  • అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ : 196 పోస్టులను కేటాయించారు.
  • ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III (దేవాదాయ శాఖ - : 104 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
  • ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ : 78 పోస్టులు భర్తీ చేయనున్నారు.
  • హోస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II : బిసి, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల్లో కలిపి 73 ఖాళీలను చేర్చారు.
  • అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ : పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 40 పోస్టులున్నాయి.
  • హార్టికల్చర్ ఆఫీసర్ : 37 ఖాళీలను ప్రకటించారు.
  • ఫారెస్ట్ విభాగం పోస్టులు: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (26), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (23), డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్-II (20), ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (4) పోస్టులు ఉన్నాయి. ఇ
  • ఇతర ముఖ్య పోస్టులు: సూపర్‌వైజర్ గ్రేడ్-1 (29), ఎనలిస్ట్ గ్రేడ్-II (18), అసిస్టెంట్ డైరెక్టర్ స్టాటిస్టిక్స్ (17), డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (15), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ (12) వంటి పలు ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

దరఖాస్తు తేదీలు :

  • హార్టికల్చర్ ఆఫీసర్ (37 పోస్టులు) : 2026 అక్టోబర్ 06 నుంచి అక్టోబర్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • హోస్టల్ వెల్ఫేర్, అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు : 2026 అక్టోబర్ 09 నుంచి అక్టోబర్ 29 వరకు గడువు ఇచ్చారు.
  • స్టాటిస్టిక్స్, ట్రైబల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు : 2026 అక్టోబర్ 13 నుంచి నవంబర్ 02 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.
  • ఫ్యాక్టరీస్, ఎండోమెంట్స్, ఫారెస్ట్, ఇతర పోస్టులు : 2026 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 05 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీల సంఖ్య, అర్హతలు తాత్కాలికమైనవని…. వీటిలో మార్పులు జరిగే అవకాశం ఉందని కమిషన్ తెలిపింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే లోపు సమగ్ర (Detailed) నోటిఫికేషన్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఉద్యోగ నియామకాలు, పరీక్షల తేదీలకు సంబంధించిన అప్‌డేట్ల కోసం ఎప్పటికప్పుడు కేవలం అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ను మాత్రమే పరిశీలించాలని కమిషన్ కార్యదర్శి సూచించారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks