సత్యసాయి శతజయంతి వేడుకలకు స్పెషల్ బస్సులు.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు కూడా సర్వీసులు!

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. మరోవైపు వచ్చే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ప్లాన్ చేసింది.

Published on: Nov 10, 2025, 14:32:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ 200 స్పెషల్ బస్సులు నడపనున్నట్టుగా సంస్థ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రద్దీని బట్టి సర్వీసులను పెంచుతారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు కూడా ప్రత్యేక సర్వీసులు ఉంటాయి. పుట్టపర్తికి వచ్చే భక్తులకు ప్రయాణానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.

ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు
ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు

ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బస్సు సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సు సర్వీసుల గురించి సమాచారం కోసం అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి బస్టాండుల్లో కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ WWW.apsrtconline.in ద్వారా సీటు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయి.

ఒకవేళ మీ ఊరి జనాలు లేదా మీ బంధువులంతా కలిసి.. 40 మందికిపైగా ఉంటే ఆర్టీసీ అధికారులను సంప్రదించవచ్చు. ప్రత్యేకంగా బస్సు సర్వీసు కూడా ఉంటుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు సైతం స్పెషల్ బస్సు సర్వీసులు నడుస్తాయి. రాకపోకలు పెరిగే అవకాశం ఉంటే.. బస్సుల సంఖ్యను ఆర్టీసీ పెంచనుంది.

టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మరోవైపు టీజీఎస్ఆర్టీసీ కూడా హైదరాబాద్-1 డిపో నవంబరులో ప్రతీ శనివారం సాయంత్రం పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టుగా ప్రకటించింది. నవంబర్ 1, 8, 15, 22వ తేదీల్లో నడిపేందుకు ప్లాన్ చేసింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు బయల్దేరి మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటుంది.

పుట్టపర్తి నుంచి అదే రోజు సాయంత్రం 6 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. 36 సీట్లతో కూడిన సూపర్ లగ్జరీ బస్సులో ఒక్కరికి రూ.2100 ఛార్జీలు ఉంటాయి. టికెట్ బుకింగ్ కోసం బుకింగ్ ఏజెంట్లు లేదా టీజీఎస్ఆర్టీసీ ఆన్‌లైన్ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. మరింత సమాచారం కోసం 9440566379, 7382824794 నెంబర్లను సంప్రదించండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More