శబరిమలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. బడ్జెట్ ధరలో మూడు రకాల యాత్ర ప్యాకేజీలు!
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మూడు రకాల యాత్ర ప్యాకేజీలతో ప్రత్యేక బస్సులను నడపుతోంది. డిసెంబర్ 12 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
శబరిమలకు వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. బడ్జెట్ ధరలోనే మూడు రకాల యాత్ర ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. శబరిమల వెళ్లాలనుకునే భక్తులు ఈ ప్యాకేజీలను చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఏపీఎస్ఆర్టీసీ శబరిమలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. డిసెంబర్ 12వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు అయ్యప్ప దర్శనం కోసం వెళ్లాలి అనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. మెుత్తం మూడు యాత్ర ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటంటే.. శ్రీఘ్రయాత్ర, సత్వర యాత్ర, యాత్ర సర్వీస్ పేరుతో మూడు రకాల ప్యాకేజీలు ప్రకటించారు. మరో విషయం ఏంటంటే ఈ సర్వీసులు విశాఖపట్నం నుంచి ప్రారంభం అవుతాయి.
శీఘ్రయాత్ర
శీఘ్రయాత్ర 5 రోజులు ఉంటుంది. విశాఖపట్నం నుంచి బయలుదేరి.. విజయవాడ, మేల్ మరుతుర్, ఎరుమేలి మీదుగా పంబ సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ మీదుగా విశాఖ వస్తారు. ఒక్కొరికి సూపర్ లగ్జరీ టికెట్‌ను రూ.6660గా నిర్ణయించారు. ఇంద్ర ఏసీ సర్వీసు అయితే రూ.8500గా టికెట్ ధర ఉంది.
సత్వర యాత్ర
సత్వర యాత్ర ఆరు రోజులు ఉంటుంది. విశాఖపట్నం నుంచి బయలుదేరి.. విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి మీదు పంబ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి, శ్రీకాళహస్తి, అన్నవరం మీదుగా విశాఖ వస్తుంది. సూపర్ లగ్జరీ ఒక్కొరికి రూ.7 వేలు, ఇంద్ర సర్వీస్ ఏసీ అయితే.. రూ.9వేలుగా టికెట్ ధర ఉంది.
యాత్ర సర్వీస్
యాత్ర సర్వీస్ ఏడు రోజుల ప్యాకేజీ ఉంది. ఇది విశాఖపట్నం నుంచి బయలుదేరి.. విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి మీదుగా పంబ చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో మధురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరం మీదుగా విశాఖ వస్తారు. ఇందులో సూపర్ లగ్జరీ రూ.7600, ఇంద్ర ఏసీ అయితే రూ.10 వేలుగా టికెట్ ధర ఉంది.
శబరిమల యాత్రకు సంబంధించి వివరాల కోసం 7382914219ను కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే 8309265666, 9959225602, 9052227083, 9959225594 నెంబర్లను కూడా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే www.apsrtconline.in కి వెళ్లండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


