...
...
Next Story

APSWREIS Recruitment : ఏపీ గురుకులాల్లో ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తులకు చివరి తేదీ ఇదే

APSWREIS Faculty Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (APSWREIS) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఐఐటీ-నీట్ కోచింగ్ సెంటర్లలో 27 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Published on: Oct 10, 2026, 13:04:17 IST
Advertisement

APSWREIS Faculty Recruitment 2026 : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (APSWREIS) నిరుద్యోగులు, అనుభవజ్ఞులైన బోధకులకు మంచి అవకాశం కల్పించింది. గురుకుల సొసైటీ నిర్వహణలో నడుస్తున్న ఐఐటీ-నీట్ (IIT-NEET) శిక్షణ కేంద్రాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన బోధనా సిబ్బందిని (ఫ్యాకల్టీ) నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఫ్యాకల్టీ పోస్టులు
ఫ్యాకల్టీ పోస్టులు

సొసైటీ పరిధిలోని కోచింగ్ సెంటర్లలో మొత్తం 27 ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే.. గణితం విభాగంలో 7 పోస్టులు, భౌతిక శాస్త్రం విభాగంలో అత్యధికంగా 12 పోస్టులు ఉన్నాయి. అలాగే రసాయన శాస్త్రం లో 3 పోస్టులు, వృక్షశాస్త్రం (Botany) లో 2 పోస్టులు, జంతుశాస్త్రం విభాగంలో 3 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ముఖ్యమైన తేదీలు….

అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 10, 2026 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 26, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

పోస్టులకు సంబంధించిన అర్హతలు, విద్యా అర్హతల నిబంధనలు, రిజర్వేషన్ల వివరాలు, ఎంపిక విధానం, నియమ నిబంధనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ https://swreis.ap.gov.in లో అందుబాటులో ఉంటుంది. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అనుభవం కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సొసైటీ వర్గాలు సూచించాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks