ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల(AEE) నియామకాలు పలుకుబడికి లేదా అవకతవకలకు తావులేకుండా, కేవలం మెరిట్ ఆధారంగానే జరుగుతాయని APTRANSCO పునరుద్ఘాటించింది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, కంప్యూటర్ ఆధారితంగా ఉంటుందని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్(విజిలెన్స్ అండ్ హెచ్ఆర్‌డీ) సూర్య సాయి ప్రవీణ్ చంద్ వెల్లడించారు. అలాగే గేట్, యూజీసీ-నెట్ వంటి జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని స్పష్టం చేశారు.

పరీక్ష వాయిదా, సిలబస్ మార్పులు లేదా ఉద్యోగాల అమ్మకం వంటి వదంతులను ఆయన తోసిపుచ్చారు. 2026 ఆగస్టు 22 నుండి 29 వరకు షెడ్యూల్ ప్రకారం సీబీటీ జరుగుతుందని ఆయన నొక్కి చెప్పారు. 23,000కు పైగా దరఖాస్తులు అందినట్లు ప్రవీణ్ చంద్ వెల్లడించారు. అభ్యర్థులను బ్రోకర్లు, జాబ్ అప్పిస్తామని చెప్పేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎంపిక కేవలం ప్రతిభ ఆధారంగానే జరుగుతుందన్నారు.
సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని సాయి ప్రవీణ్ చంద్ ధృవీకరించారు. నకిలీ అభ్యర్థులను లేదా అక్రమ పద్ధతులను నివారించడానికి కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత నియామకాల కంటే ఈసారి అభ్యర్థులకు సన్నద్ధం కావడానికి 58 రోజులు ఎక్కువ సమయం ఇచ్చామని గుర్తుచేశారు. అధికారిక నోటిఫికేషన్‌లను మాత్రమే నమ్ముకోవాలని కోరారు.
'ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీ పవర్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో 24x7 ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయడం అత్యంత కీలకం. నియామక ప్రక్రియ ఆలస్యం లేకుండా కొనసాగుతుంది.' అని సాయి ప్రవీణ్ చంద్ అన్నారు.
ఏపీట్రాన్స్‌కోలో 200 ఏఈఈ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఎలక్ట్రిక్, టెలికాం విభాగాల్లో రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. జులై 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000గా ఉంది. పరీక్ష కేంద్రాలు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు. జనరల్ అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ వారికి మినహాయింపు ఉంటుంది.
{{/usCountry}}ఏపీట్రాన్స్‌కోలో 200 ఏఈఈ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఎలక్ట్రిక్, టెలికాం విభాగాల్లో రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. జులై 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000గా ఉంది. పరీక్ష కేంద్రాలు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు. జనరల్ అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ వారికి మినహాయింపు ఉంటుంది.
{{/usCountry}}ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక వెబ్‌సైట్ వెళ్లండి.