ఏపీట్రాన్స్‌‌కోలో 200 ఏఈఈ ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగానే ఎంపిక

ఏపీట్రాన్స్‌‌కోలో 200 ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు మెరిట్ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని ఏపీట్రాన్స్‌కో పునరుద్ఘాటించింది.

Published on: Jul 10, 2026, 09:54:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల(AEE) నియామకాలు పలుకుబడికి లేదా అవకతవకలకు తావులేకుండా, కేవలం మెరిట్ ఆధారంగానే జరుగుతాయని APTRANSCO పునరుద్ఘాటించింది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, కంప్యూటర్ ఆధారితంగా ఉంటుందని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్(విజిలెన్స్ అండ్ హెచ్ఆర్‌డీ) సూర్య సాయి ప్రవీణ్ చంద్ వెల్లడించారు. అలాగే గేట్, యూజీసీ-నెట్ వంటి జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని స్పష్టం చేశారు.

ఏపీట్రాన్స్‌కో ఉద్యోగాలు
ఏపీట్రాన్స్‌కో ఉద్యోగాలు

పరీక్ష వాయిదా, సిలబస్ మార్పులు లేదా ఉద్యోగాల అమ్మకం వంటి వదంతులను ఆయన తోసిపుచ్చారు. 2026 ఆగస్టు 22 నుండి 29 వరకు షెడ్యూల్ ప్రకారం సీబీటీ జరుగుతుందని ఆయన నొక్కి చెప్పారు. 23,000కు పైగా దరఖాస్తులు అందినట్లు ప్రవీణ్ చంద్ వెల్లడించారు. అభ్యర్థులను బ్రోకర్లు, జాబ్ అప్పిస్తామని చెప్పేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎంపిక కేవలం ప్రతిభ ఆధారంగానే జరుగుతుందన్నారు.

సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని సాయి ప్రవీణ్ చంద్ ధృవీకరించారు. నకిలీ అభ్యర్థులను లేదా అక్రమ పద్ధతులను నివారించడానికి కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత నియామకాల కంటే ఈసారి అభ్యర్థులకు సన్నద్ధం కావడానికి 58 రోజులు ఎక్కువ సమయం ఇచ్చామని గుర్తుచేశారు. అధికారిక నోటిఫికేషన్‌లను మాత్రమే నమ్ముకోవాలని కోరారు.

'ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీ పవర్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో 24x7 ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయడం అత్యంత కీలకం. నియామక ప్రక్రియ ఆలస్యం లేకుండా కొనసాగుతుంది.' అని సాయి ప్రవీణ్ చంద్ అన్నారు.

ఏపీట్రాన్స్‌కోలో 200 ఏఈఈ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఎలక్ట్రిక్, టెలికాం విభాగాల్లో రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. జులై 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000గా ఉంది. పరీక్ష కేంద్రాలు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు. జనరల్ అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ వారికి మినహాయింపు ఉంటుంది.

ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక వెబ్‌సైట్ వెళ్లండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More