...
...
Next Story

APTWREIS Notification : ఏపీ గిరిజన గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు - దరఖాస్తు తేదీలు, పూర్తి సమాచారం ఇదే

APTWRS అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కామన్ ఎంట్రెన్స్ ద్వారా రాష్ట్రంలోని 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఫిబ్రవరి 5 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అవుతుంది.

Published on: Jan 30, 2026 12:41 PM IST
Advertisement

రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ మేరకు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APTWREIS) నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు
ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు

ఈ ప్రవేశాల కోసం అర్హులైన వారు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.ప్రతి జనరల్ ఎస్టీ గురుకుల పాఠశాలలో మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఈ 80 సీట్లను ఒక్కో సెక్షన్‌కు 40 మంది చొప్పున రెండు సెక్షన్లుగా విభజిస్తారు. మొత్తం సీట్లలో ఎస్టీలకు 78 శాతం సీట్లను కేటాయిస్తారు. మిగతా సీట్లను బీసీ, ఓసీ, ఎస్సీ విద్యార్థులతో భర్తీ చేస్తారు.

APTWREIS నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు

  • అడ్మిషన్ల నోటిఫికేషన్ -గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఆంధ్రప్రదేశ్
  • ప్రవేశాలు - 5వ తరగతి
  • గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,00,000 మించకూడదు.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - 5 ఫిబ్రవరి 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ - 28 ఫిబ్రవరి 2026
  • హాల్ టికెట్ డౌన్లోడ్ - 10 మార్చి 2026
  • ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ - 4 ఏప్రిల్ 2026
  • ఎంపిక విధానం - రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు
  • 4వ తరగతి స్థాయి సిలబస్‌తో మొత్తం 50 మార్కులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
  • తెలుగు-10 మార్కులు, ఆంగ్లం-10 మార్కులు, మ్యాథ్స్-15 మార్కులు, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌ నుంచి 15 మార్కులు ఉంటాయి.
  • మెరిట్ జాబితా ప్రకటన - 29 ఏప్రిల్ 2026
  • ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ - 09 మే 2026
  • సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ - 25 మే 2026
  • థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ - 10 జూన్ 2026
  • అధికారిక వెబ్ సైట్ - https://aptwreis.apcfss.in/

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe