...
...
Next Story

AUEET 2026 : ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల

ఆంధ్ర విశ్వవిద్యాలయం AUEET-2026 అడ్మిషన్ల కోసం రెండో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ముఖ్యమైన తేదీలను కింద చూడండి.

Published on: Jul 4, 2026, 10:13:14 IST
Advertisement

ఆంధ్ర విశ్వవిద్యాలయం AUEET 2026 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వెబ్ కౌన్సెలింగ్ జూలై 4, 2026న audoa.andhrauniversity.edu.inలో ప్రారంభమైంది. మొదటి దశలో సీటు పొందలేని అభ్యర్థులు రెండో దశేకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మొదటి దశ కేటాయింపుతో అసంతృప్తిగా ఉన్నవారు, మొదటి రౌండ్‌లో పాల్గొనని అభ్యర్థులు కూడా ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ ఎంట్రీ, ప్రొవిజనల్ సీట్ కేటాయింపు, కోర్సు ఫీజు చెల్లింపు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు

  • రెండో దశ నమోదు- జూలై 4 నుండి జూలై 6, 2026 వరకు
  • సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయడం-జూలై 4 నుండి జూలై 8, 2026 వరకు
  • మొదటి దశ తర్వాత ఖాళీల స్థానాల ప్రదర్శన-జూలై 3
  • ఫేజ్ 2 (AUEET 2026) కోసం వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ-జూలై 6 నుండి జూలై 10, 2026 వరకు
  • ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్(దశ 2)-జూలై 13
  • ఫీజు పేమెంట్-జూలై 14 నుంచి జూలై 20 వరకు
  • ఆఫ్‌లైన్ రిపోర్టింగ్ తరువాత ప్రకటిస్తారు.

ఆంధ్ర యూనివర్సిటీ ఏయూఈఈటీ 2026 అడ్మిషన్స్
ఆంధ్ర యూనివర్సిటీ ఏయూఈఈటీ 2026 అడ్మిషన్స్

మొదటి రౌండ్ తర్వాత ఖాళీ అయిన సీట్లను భర్తీ చేయడానికి రెండో దశ ఉంటుంది. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బి.టెక్, ఎం.టెక్ ప్రోగ్రామ్ సెల్ఫ్-సపోర్ట్ కోర్సు ఫీజులు బ్రాంచ్‌ను బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఫేజ్ 2 కోసం రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లో పోర్టల్ ద్వారా జరుగుతుంది.

  • audoa.andhrauniversity.edu.in లోని అధికారిక పోర్టల్‌ను సందర్శించండి .
  • AUEET 2026 ఫేజ్ 2 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి .
  • AUEET 2026 హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ కార్డ్ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి .
  • ఆన్‌లైన్ ధృవీకరణ కోసం అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి .
  • నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి .
  • ప్రాధాన్యత గల డిపార్ట్‌మెంట్స్ వరుస క్రమంలో ర్యాంక్ చేయడం ద్వారా వెబ్ ఆప్షన్స్ ఎంచుకోండి .
  • ఎంపికలను లాక్ చేసి, కన్ఫామ్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి .

ఆన్‌లైన్ ధృవీకరణ ప్రక్రియను ప్రారంభించే ముందు అభ్యర్థులు కింది పత్రాల స్కాన్ చేసిన కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి. AUEET 2026 ర్యాంక్ కార్డ్ మరియు హాల్ టికెట్, 10వ తరగతి మరియు 12వ తరగతి మార్క్ షీట్లు, చివరి విద్యాసంస్థ నుండి బదిలీ సర్టిఫికేట్ (TC), 12 తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, వర్తిస్తే కుల ధృవీకరణ పత్రం, ఫీజు వాపసు క్లెయిమ్‌ల కోసం ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, EWS లేదా PwD సర్టిఫికేట్ ఉంటే రెడీ చేసుకోండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe