చిత్తూరు : కాలేజీలోని మూడో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్ధి సూసైడ్ - వారంలో రెండో ఘటన….!
చిత్తూరు జిల్లాలోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి కాలేజీలో విషాదం జరిగింది. భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజుల వ్యవధిలో ఏకంగా ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది.
చిత్తూరు జిల్లాలోని శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ స్టడీస్ (సీటమ్స్)లో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

తీవ్రగాయాలైన అతడిని ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత తమిళనాడులోని వెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తరువాత… మృతుడి కుటుంబ సభ్యులు కాలేజీకి చేరుకున్నారు. సూసైడ్ గురించి కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి రావడంతో కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణ సమయంలో చిత్తూరు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు మృతుడి కుటుంబ సభ్యులను దూరంగా నెట్టడంతో మరింత గందరగోళం నెలకొంది.
తమ కుమారుడి మరణానికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యంతో పాటు పోలీసులు కూడా తమ పట్ల దుసురుగా ప్రవర్తించారని ఆరోపించారు.
చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ… ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
మరోవైపు గత నెలలోనూ(అక్టోబర్ 31) నందిని అనే విద్యార్థి కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వేలూరు సిఎంసి ఆసుపత్రిలో నందిని తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. అయితే చిత్తూరు తాలూకా పోలీసులు ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేశారు. వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమా లేదా ఏ ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

