ఆన్‌లో బైక్ ఇంజిన్.. రాత్రంతా పొగ పీలుస్తూ ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రంతా బైక్‌ను ఆన్‌లో ఉంచడంతో ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు.

Published on: Mar 15, 2026 12:29 PM IST
By , Annamayya
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలోని అన్నమయ్య జిల్లా పుంగనూరులో దారుణమైన ఘటన జరిగింది. బైక్ నుంచి వచ్చిన పొగ కారణంగా నలుగురు మృతి చెందారు. బైక్ నుండి వచ్చే పొగను గంటల తరబడి పీల్చడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఊపిరాడక మరణించారు. నలుగురు వ్యక్తులు నిద్రలోనే మరణించారు. ఈ ఘటన పుంగనూరులోని త్యాగరాజు వీధిలో జరిగింది. మృతి చెందినవారిలో తాత, మనవడు, మనవరాళ్లు ఉన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

త్యాగరాజు వీధికి చెందిన మురళి... శనివారంనాడు బైక్‌ను మెకానిక్‌కు ఇచ్చాడు. ఇంజిన్ సమస్య ఉంది. బోర్ చేయించాక మురళి బైక్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే బైక్‌ను చాలాసేపు ఆన్‌లోనే ఉంచాలని మెకానిక్ చెప్పడంతో ఇంట్లోనే తలుపులు వేసి.. ఆన్‌లోనే ఉంచాడు మురళి. అయితే ఇళ్లు ఇరుకుగా ఉంది. దీంతో పొగ బయటకు వెళ్లలేదు. ఇంట్లో కింద మురళి తండ్రి రామచంద్రయ్య, మురళి పిల్లలు కార్తీక్, చరిత, చందన పడుకున్నారు. మురళితోపాటుగా అతడి భార్య రేవతి పైగదిలో పడుకున్నారు.

రాత్రంతా బైక్ ఇంజిన్ పొగ పీల్చిన తాత రామచంద్రయ్య, మనవడు కార్తీక్, మనవరాళ్లు చరిత, చందన చనిపోయారు. పైన గదిలో పడుకున్న మురళి, రేవతి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నలుగురు కూడా బైక్ పార్క్ చేసిన గదిలోనే నిద్రపోవడంతో ఈ విషాదం జరిగింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More