ఏపీకి మరో భారీ పెట్టుబడి - రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడితో రానున్న ‘బ్రూక్‌ఫీల్డ్’
ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రూ.1.1 లక్షల కోట్లతో బ్రూక్‌ఫీల్డ్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇదే విషయాన్ని ఐటీ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడి రాబోతోందంటూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిన్న చేసిన ట్వీట్‌తో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ రాష్ట్రంలో ఏకంగా 12 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ చరిత్రాత్మక పెట్టుబడితో ఏపీ ప్రగతి పథంలో మరో ముందడుగు వేయనుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ పెట్టుబడి ద్వారా ప్రధానంగా పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్, సోలార్ తయారీ, ఇతర డీకార్బనైజేషన్ కార్యక్రమాలపై దృష్టి సారించనున్నట్టు లోకేశ్ తన ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు డేటా సెంటర్లు, వాణిజ్య రియల్ ఎస్టేట్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ), మౌలిక సదుపాయాలు, పోర్టుల వంటి విభిన్న రంగాల్లోనూ బ్రూక్‌ఫీల్డ్ పాలుపంచుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌కు బ్రూక్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థను స్వాగతించడం గర్వంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుస్థిర, పరివర్తనాత్మక పెట్టుబడులకు ప్రముఖ గమ్యస్థానంగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా, రాష్ట్రంలోకి ఓ పెద్ద అంతర్జాతీయ సంస్థ అడుగుపెట్టబోతోందంటూ లోకేశ్ కొద్ది రోజుల క్రితం పరోక్షంగా ట్వీట్ చేయడంతో పారిశ్రామిక, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా బ్రూక్‌ఫీల్డ్ పేరును… పెట్టుబడి వివరాలను వెల్లడించడంతో ఆ సస్పెన్స్‌కు తెరపడినట్టయింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

