...
...
Next Story

హైవేపై ప్రైవేట్ బస్సు ద‌గ్ధం - క్ష‌ణాల్లోనే అంటుకున్న మంట‌లు..! ప్రయాణికులంతా….

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై బుధవారం వేకువజామున ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Published on: Jan 7, 2026, 12:33:10 IST
Advertisement

తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సులో పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదు. మొత్తం 10 మంది ప్రయాణికులు ఉండగా… సురక్షితంగా బయటపడ్డారు.

కొవ్వూరు హైవేపై బస్సు దగ్ధం
కొవ్వూరు హైవేపై బస్సు దగ్ధం

ప్రాథమిక వివరాల ప్రకారం…. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌ పైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. తెల్లవారుజాము సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే… ప్రయాణికులను బయటికి దింపేశాడు. వాహనం పూర్తిగా దగ్ధం కాగా… మొత్తం 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. డైనమోలో సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగాయని డ్రైవర్ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

“టోల్ ప్లాజా దగ్గర బస్సు ఆగిన తర్వాత డ్రైవర్ ఇంజిన్ ను పరిశీలించి నిప్పురవ్వలను గమనించాడు. అతను వెంటనే వాహనంలో ఉన్నవారిని అప్రమత్తం చేశాడు, వారు వెంటనే దిగారు. డ్రైవర్ వెంటనే స్పందించటంతో భారీ ప్రమాదం తప్పింది” అని పోలీసులు తెలిపారు.

వాహనంలో ఉన్నవారిని కేవలం 10 నిమిషాల్లోనే లగేజీతో పాటు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారని పోలీసులు పేర్కొన్నారు. ప్రయాణికులు వెళ్లేందుకు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని వివరించారు. ట్రాఫిక్ జామ్ కావటంతో వెంటనే నియంత్రించారు. కేసు నమోదు కాగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe