ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సరికొత్త సంచలనాలకు వేదికవుతున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతతో రూపొందించిన ఒక చిన్నారి వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘ఆర్న ఐఏఎస్’ పేరుతో చక్కర్లు కొడుతున్న ఈ ఫన్నీ ఏఐ వీడియోపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికరంగా స్పందించారు.

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ నువ్ నాకు నచ్చావ్ అనే సూపర్ హిట్ సినిమాలో చెప్పిన ఎమోషనల్ డైలాగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా తీసుకుని ఏఐ వీడియోను క్రియేట్ చేశారు. ఇందులో ‘ఆర్న’ అనే చిన్నారి విశాఖపట్నం (వైజాగ్) కలెక్టర్‌గా కుర్చీలో కూర్చుని ఉంటుంది.
'నేను కష్టపడి ఐఏఎస్ పాసై, వైజాగ్ కలెక్టర్ చైర్‌లో కూర్చుంటాను. ఒకరోజు సీఎం చంద్రబాబు నాయుడుతో వీడియో కాన్ఫరెన్స్‌లో బిజీగా ఉన్నప్పుడు.. అకస్మాత్తుగా కిటికీలోంచి బయటకు చూస్తే మా నాన్న కనిపిస్తారు. వెంటనే నేను.. చంద్రబాబూ.. బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు.' అని చెప్పేసి, టీవీ కట్టేస్తాను. నేరుగా బయటకు వచ్చేసి.. 'నన్ను క్షమించు నాన్నా.. నిన్ను వెయిట్ చేయించాను' అంటూ మా నాన్న కాళ్ల మీద పడతాను.."
ఈ విధంగా డైలాగ్ చెబుతున్నట్లుగా క్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ సాధిస్తోంది.
ఈ వైరల్ వీడియో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా దీనిపై స్పందించారు. ఆ వీడియోను రీపోస్ట్ చేస్తూ.. "ఈ క్యూట్ వీడియో చూసి నవ్వకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం. నేను అధికారికంగా ఈ ఆర్న ఐఏఎస్‌కు నా మద్దతును ప్రకటిస్తున్నాను." అంటూ సరదాగా ట్వీట్ చేశారు. సీఎం స్వయంగా స్పందించడంతో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది.
గతకొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమాలలో చాలా చురుగ్గా ఉంటూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన 96 ఏళ్ల వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ.. తనకు చంద్రబాబును కలవాలని ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం, ఆ గ్రామానికి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా సత్యనారాయణను కలిసి ముచ్చటించారు.
{{/usCountry}}గతకొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమాలలో చాలా చురుగ్గా ఉంటూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన 96 ఏళ్ల వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ.. తనకు చంద్రబాబును కలవాలని ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం, ఆ గ్రామానికి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా సత్యనారాయణను కలిసి ముచ్చటించారు.
{{/usCountry}}చంద్రబాబు స్వయంగా సోషల్ మీడియాను నిశితంగా గమనిస్తున్నారనే సంకేతాలు వెళ్లడంతో పార్టీ శ్రేణులు, నాయకులు అలర్ట్ అయ్యారు. క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలపై చంద్రబాబు దృష్టి పెడుతుండటంతో, లీడర్లు మరింత క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, ప్రజలకు చేరువవడంలో చంద్రబాబు మార్క్ ఎప్పుడు కనిపిస్తుంటుంది. టీడీపీ సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ బాగుంటుంది.