...
...
Next Story

ఈ తేదీ నుంచి చెన్నై టూ నరసాపురం వరకు వందే భారత్ సర్వీసులు స్టార్ట్

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. చెన్నై సెంట్రల్ నుంచి-నరసాపురం వరకు వందే భారత్ రైలు రానుంది. సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తాజాగా రైల్వే ప్రకటించింది.

Published on: Nov 12, 2025, 21:27:26 IST
Advertisement

చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తున్నట్టుగా ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తాజాగా రైల్వే బోర్డు ఏ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయో క్లారిటీ ఇచ్చింది. 12 జనవరి 2026 నుంచి వందే భారత్ సర్వీసులు నరసాపురం వరకు వెళ్తాయని సదరన్ రైల్వే ప్రకటించింది. దీనితో వందే భారత్ రైలు ద్వారా విజయవాడ చేరుకుని.. తర్వాత నరసాపురం వైపు జర్నీ చేసేవారికి ఉపశమనం కలగనుంది. నేరుగా నరసాపురం వరకూ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

వందే భారత్ ఎక్స్ ప్రెస్
వందే భారత్ ఎక్స్ ప్రెస్

ట్రైన్ నెంబర్ 20677 చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5:30 గంటలకు బయలుదేరుతుంది. రేణిగుంట(7:10), నెల్లూరు(8:30), ఒంగోలు(9:45), తెనాలి(11:10), విజయవాడ(11:45), గుడివాడ(12:30), భీమవరం టౌన్(1:15), నర్సాపురం(2:10)కి చేరుకుంటుంది.

నర్సాపురం నుంచి చెన్నై సెంట్రల్ వచ్చే ట్రైన్ నెంబర్ 20678 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం 2.50కి బయలుదేరుతుంది. 3:20 గంటలకు భీమవరం, మధ్యాహ్నం 4:10కి గుడివాడ, 4:50కి విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుంచి 4.55 గంటలకు బయలుదేరుతుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్లి రాత్రి 11:45 గంటలకు చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు వస్తుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.

పలు రైళ్లు రద్దు

17267 కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం, 17268 విశాఖపట్నం - కాకినాడ పోర్ట్, 67285 రాజమండ్రి - విశాఖపట్నం, 67286 విశాఖపట్నం - రాజమండ్రి రైళ్లను రద్దు చేశారు.ప్రయాణీకులు గమనించి తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe