...
...
Next Story

చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసు : కోర్టు సంచలన తీర్పు - ఐదుగురికి ఉరిశిక్ష

చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది.2015 నవంబరు 17వ తేదీన ఈ హత్య జరిగింది.

Published on: Oct 31, 2025, 12:27:13 IST
Advertisement

చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు కోర్టు తీర్పునిచ్చింది. ఈ హత్య ఘటన 2015 నవంబరు 17వ తేదీన చోటు చేసుకుంది.

చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసు : ఐదుగురికి ఉరిశిక్ష - కోర్టు సంచలన తీర్పు
చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసు : ఐదుగురికి ఉరిశిక్ష - కోర్టు సంచలన తీర్పు

అప్పటి చిత్తూరు మేయర్‌ కఠారి అనురాధ, మోహన్‌ దంపతుల హత్య జరిగింది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న చంద్రశేఖర్, జీఎస్ వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్లకు కోర్టు ఉరిశిక్ష విధించింది.

కోర్టు తీర్పు సందర్భంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీలు, సంబరాలు వంటివి చేసుకోకుండా ఆంక్షలు విధించారు. కోర్టు పరిసర ప్రాంతాల్లోనూ భద్రతను ఏర్పాటు చేశారు.

కేసు వివరాలు:

2015 నవంబరు 17న అప్పటి చిత్తూరు మేయర్‌ కఠారి అనురాధ, మోహన్‌ దంపతుల హత్య జరిగింది. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. కఠారి మోహన్‌, ఆయన మేనల్లుడైన చింటూ మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వీరిని అడ్డు తొలగించుకోవాలని చింటూ ప్లాన్ వేశాడు. మరో నలుగురితో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించి… కఠారి అనురాధపై కాల్పులు జరిపారు. పక్కన గదిలో ఉన్న కఠారి మోహన్‌ను కత్తులతో నరికేశారు. దీంతో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ హత్య సంచలనం రేపింది.

దాదాపు 10 సంవత్సరాల పాటు విచారణ జరిగింది. 352 వాయిదాలు, 130 మంది సాక్షులను విచారించాక ఐదుగురికి ఉరిశిక్ష ఖరారైంది. A1గా ఉన్న చింటూకు రూ.70 లక్షలు జరిమానా కూడా విధించింది. మేయర్ కుటుంబానికి రూ.50 లక్షలు, ప్రమాద సమయంలో గాయపడిన సతీష్ కు రూ.20 లక్షలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. శిక్ష పడిన వారిని కడప జైలుకు తరలించనున్నారు. ఇందుకోసం పోలీసులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe