...
...
Next Story

Hindupuram : కత్తితో దాడి - మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ పై సీఐ కాల్పులు

హిందూపురంలో కాల్పులు కలకలం రేపాయి. సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిలపై రౌడీషీటర్ నాగేంద్ర కత్తితో దాడి చేశాడు. పారిపోతున్న క్రమంలో నాగేంద్రంపై సీఐ కాల్పులు జరిపాడు. ఎర్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Published on: Feb 6, 2026, 13:42:18 IST
Advertisement

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో కాల్పులు కలకలం రేపాయి. పట్టణంలో సీఐగా పని చేస్తున్న ఆంజనేయులు, కానిస్టేబుల్‌ రవిపై మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ నాగేంద్ర కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ… నాగేంద్ర కాలిపై కాల్పులు జరిపారు. దీంతో అతడికి గాయాలయ్యాయి. ఎర్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

కాల్పుల కలకలం (Representative Image ) (image source Pixabay)
కాల్పుల కలకలం (Representative Image ) (image source Pixabay)

గాయపడిన సీఐ, కానిస్టేబుల్‌తో పాటు నిందితుడిని హిందూపురంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ గ్యాంప్ రేప్ కేసులో నాగేంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నాగేంద్ర తిరగబడ్డాడు.

నిందితుడిపై 90కిపైగా క్రిమినల్ కేసులు - డీఎస్పీ

హిందూపూర్ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ కేవీ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం…. నిందితుడిని పట్టుకోవడానికి ముగ్గురు సభ్యులతో కూడిన పోలీసుల బృందం వెళ్లింది. ఉదయం 6.30 గంటల సమయంలో కానిస్టేబుల్ పై దాడి చేశాడు. అతనికి గాయాలయ్యాయి. మరో బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. సీఐ నిందితుడి వద్దకు వెళ్లగా… అతను లొంగిపోయినట్లు నటించాడు. కానీ అకస్మాత్తుగా ఇన్స్పెక్టర్ పై కత్తితో దాడి చేశాడు.

ఇన్స్పెక్టర్ మొదట హెచ్చరికగా గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. కానీ నిందితుడు ముందుకు రావటంతో… ఆత్మరక్షణలో భాగంగా అతనికి మోకాలిపై కాల్పులు జరిపాడని డీఎస్పీ తెలిపారు. దాదాపు 90 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు.

40 ఏళ్ల నాగేంద్రకు సుదీర్ఘ నేర చరిత్ర ఉందని…. ఆయనపై శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోనే దాదాపు 41 కేసులు నమోదయ్యాయని డీఎస్పీ పేర్కొన్నారు. చిలమత్తూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన సామూహిక అత్యాచారం కేసులో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో కోర్టు విచారణలకు రాకుండా నాగేంద్ర తప్పించుకుని తిరుగుతున్నాడని డీఎస్పీ మహేష్ తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks