...
...
Next Story

అగ్నిమాపక శాఖలో అధునాతన వ్యవస్థ - 58 ఫైర్‌ ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

రూ.40 కోట్లతో అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో 25 అధునాతన ఫైర్‌ ఫైటింగ్‌ వాహనాలు.. 20 వాటర్‌ బౌజర్లు.. 13 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీపర్పస్‌ వాహనాలున్నాయి.

Published on: Aug 14, 2026, 16:55:52 IST
Advertisement

అగ్నిప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపకశాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన సుమారు రూ.40 కోట్ల విలువైన 58 అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

ఏపీ అగ్నిమాపక శాఖలోకి కొత్తగా 58 అధునాతన వాహనాలు
ఏపీ అగ్నిమాపక శాఖలోకి కొత్తగా 58 అధునాతన వాహనాలు

ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్డులో ఫైర్ సేఫ్టీ వాహనాలకు సీఎం జెండా ఊపారు. అగ్నిమాపక శాఖ అధికారులు ఆ వాహనాల ప్రత్యేకతలను సీఎంకు వివరించారు. అలాగే గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులకు ఉపయోగపడేలా... ప్రమాద ప్రాంతాలకు వేగంగా చేరుకుని తక్షణమే అగ్నిమాపక సేవలు అందించేలా రూ.18.68 కోట్ల విలువైన 25 అధునాతన అగ్నిమాపక వాహనాలు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.

రద్దీ ప్రాంతాల్లోనూ వేగంగా రాక….

పెద్ద అగ్నిప్రమాదాల సమయంలో నిరంతర నీటి సరఫరాకు ఉపయోగపడేలా రూ.14.79 కోట్ల విలువైన 20 వాటర్‌ బౌజర్లను సిద్దంగా ఉంచుకున్నామని సీఎంకు అధికారులు చెప్పారు. ఒక్కో వాటర్‌ బౌజర్‌ 14 వేల లీటర్ల నీటిని తరలించే సామర్థ్యం కలిగి ఉంటాయని... పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లో మంటలను అదుపు చేయడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయని తెలిపారు. ఇరుకైన, రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ వేగంగా చేరుకునేలా రూ.6.37 కోట్ల విలువైన 13 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీపర్పస్‌ ఫైర్‌ ఫైటింగ్‌ వాహనాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మొత్తం రూ.252.86 కోట్ల వ్యయంతో దశలవారీగా ఆధునిక వాహనాలు, పరికరాలను సమకూరుస్తున్నాం. తొలిదశలో రూ.33 కోట్ల వ్యయంతో 65 అగ్నిమాపక వాహనాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాం. రెండో దశలో రూ.40 కోట్లతో 58 వాహనాలను ఇప్పుడే ప్రారంభించుకున్నాం. ఇక త్వరలో మూడో దశలోనూ మరిన్ని అగ్నిమాపక వాహనాలు, ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాలను అందుబాటులోకి తీసుకురానున్నాం. వీటితో పాటు ఫైర్‌ స్టేషన్లల్లో మౌలిక వసతులపైనా ప్రత్యేక దృష్టి సారించాం" అని చెప్పారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe