ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ - సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అధికారులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై ఆరా తీశారు.

Published on: Jan 29, 2026, 24:22:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేలా క్షేత్రస్థాయిలో వివిధ ప్రణాళికల్ని చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ - సీఎం చంద్రబాబు
ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ - సీఎం చంద్రబాబు

బుధవారం రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించిన సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతున్న క్రమంలో పైలెట్ ప్రాజెక్టు అమలు తీరును అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్న క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”సంజీవని ప్రాజెక్టు త్వరలో రాష్ట్రస్థాయిలో అమలు చేయబోతున్నాం. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంది. ఈ క్రమంలో దీనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ తీసుకోవాలి. టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి... నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. శిశువుల నుంచి వృద్ధుల వరకూ సంజీవని ప్రాజెక్టు ద్వారా వైద్య సేవలు అందాలి" అని స్పష్టం చేశారు.

"ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. ప్రజలకు వైద్య సేవలు అందించడంతోపాటు... ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాం. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి... పోషకాహరాల వల్ల ఉపయోగాలేంటి అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా చూస్తున్నాం. న్యూట్రిషన్ యాప్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి" అని సీఎం అన్నారు.

“ప్రజారోగ్యం ప్రధాన అజెండాగా సంజీవని ప్రాజెక్టును చేపట్టాం. ప్రభుత్వం దగ్గరున్న డేటాను ఆధారంగా తీసుకుని ప్రజల ఆరోగ్యంపై విశ్లేషించడంతో పాటు...ప్రజలకు వద్దకు వెళ్లి శాంపిల్ సర్వేలు చేపట్టాలి. అప్పుడు ప్రజారోగ్యంపై పూర్తి స్థాయిలో అంచనాకు రావడానికి వీలుంటుంది. సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ అనే అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. దీంట్లో భాగంగా 72.73 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన డేటా ప్రభుత్వం వద్ద సిద్దంగా ఉండాలి. ఎనిమీయా, కార్డియాక్, డయాబెటిక్, కిడ్ని, లివర్ వంటి రోగాలపై స్టడీ చేయాలి" అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

"ప్రజారోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నియోజకవర్గాల్లో ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకునే అంశాన్ని పరిశీలించాలి. ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు లేదా పర్యావరణ సమస్యల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయనే అంశం పైనా ప్రజలకు వివరించాలి. వ్యాయామం, యోగాపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాకుండా... సాధారణ ప్రజలు అనారోగ్య బారిన పడకుండా చూసుకోవడం... ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్యను తగ్గించేలా ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించడమే లక్ష్యంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

నియోజకవర్గానికో సూపర్ స్పెషాలిటీ - సీఎం

“ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలి. నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలి. దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలి. దీనిపై కేంద్రానికి వివరాలు పంపాలి. రాష్ట్రంలో ఆస్పత్రుల నిర్మాణం, ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ప్రముఖ ఆస్పత్రి యాజమాన్యాలకు, లాభాపేక్ష లేకుండా ఆస్పత్రుల నిర్మాణం, నిర్వహణ చేపట్టే వారికి రాయితీలు ఇస్తాం" అని సీఎం చంద్రబాబు వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More