ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు మౌలిక వసతులు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.3.30 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, మెటీరియల్ రికవరీ సెంటర్‌ను ప్రారంభించారు.

అలాగే 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.70 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న మల్లనూర్ జూనియర్ కళాశాల పనులకు భూమిపూజ చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలుగా 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను సీఎం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడుల అంశంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
టీచర్ల రిక్రూట్మెంట్‌కు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఫేక్ ప్రచారాలను, విజయవాడలో స్పోర్ట్స్ టీచర్లపై జరిగిన దాడులను సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. తమ పాలనలో నిర్వహించిన డీఎస్సీలు, ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఎలాంటి అవినీతి, ప్రశ్నాపత్రాల లీకేజీలు జరగలేదని తెలిపారు. సుమారు 14 సార్లు పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించిన ట్రాక్ రికార్డు తమదని స్పష్టం చేశారు. 355 పిటిషన్లు వేసి అడ్డంకులు సృష్టించినా చట్టబద్ధంగా ప్రక్రియ పూర్తి చేశామన్నారు.
డీఎస్సీ ఉద్యోగాలు తమ కష్టార్జితమని నినదిస్తున్న ఉపాధ్యాయులపై దాడులు చేయడం దారుణమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా చర్చిస్తే వాస్తవాలు, సాక్ష్యాధారాలతో సమాధానం చెప్తామని, అక్రమంగా దాడులకు తెగబడితే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాతీయ స్థాయి కేంద్రాలు, నగరాల్లో టీచర్లు తమ నిరసన తెలపడాన్ని ప్రస్తావిస్తూ.. మీడియా ముసుగులో వైసీపీ మూకలు రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, బట్టలు ఊడదీసి నిలబెడతామని తీవ్రంగా స్పందించారు.
{{/usCountry}}డీఎస్సీ ఉద్యోగాలు తమ కష్టార్జితమని నినదిస్తున్న ఉపాధ్యాయులపై దాడులు చేయడం దారుణమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా చర్చిస్తే వాస్తవాలు, సాక్ష్యాధారాలతో సమాధానం చెప్తామని, అక్రమంగా దాడులకు తెగబడితే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాతీయ స్థాయి కేంద్రాలు, నగరాల్లో టీచర్లు తమ నిరసన తెలపడాన్ని ప్రస్తావిస్తూ.. మీడియా ముసుగులో వైసీపీ మూకలు రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, బట్టలు ఊడదీసి నిలబెడతామని తీవ్రంగా స్పందించారు.
{{/usCountry}}కుప్పం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను సీఎం వివరించారు. నియోజకవర్గంలో 8,904 బంగారు కుటుంబాలను గుర్తించి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు పీ4 కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేయూత అందిస్తోందని సీఎం తెలిపారు. కుప్పాన్ని పూర్తి స్థాయిలో పేదరికం లేని ప్రాంతంగా మార్చడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.
కుప్పంలో చెత్త రహిత వాతావరణం కల్పించేందుకు 82 ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా వ్యర్థాల నుంచి కాంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ 'నెట్ జీరో' లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. సోలార్ రూఫ్‌టాప్ విధానం ద్వారా ప్రతి ఇల్లు ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు.
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు రూపొందించిన సంజీవని ప్రాజెక్టును ఒక గేమ్ ఛేంజర్‌గా చంద్రబాబు అభివర్ణించారు. కుప్పంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల ద్వారా ఇప్పటికే 1.29 లక్షల మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ హెల్త్ రికార్డులను భద్రపరిచారు. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది పౌరుల ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి ఉచిత పరిరక్షణ చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.
కంగుంది ప్రాంతంలో దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమ్యను పరిష్కరించి 320 మందికి ఇళ్ల పట్టాలు అందజేసినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 'మీ భూమి - మీ హక్కు' పేరిట అధికారిక రాజముద్రతో కూడిన పట్టాలను అర్హులకు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.