Fuel Shortage : ఇంధన సరఫరాలో ఇబ్బందులు రావొద్దు… ప్రతి 3 గంటలకోసారి నివేదిక ఇవ్వండి - సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu Petrol Review : రాష్ట్రంలో ఇంధన కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పని చేయాలని ఆదేశించారు. 

Published on: Apr 27, 2026, 14:17:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CM Chandrababu Naidu Review : రాష్ట్రంలో ఇందన కొరతతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. అయితే ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేమిటని ఆరా తీశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు

ఉదయం నుంచి వివిధ ఆయిల్ డిస్పాచ్ సెంటర్ల నుండి వందలాది ట్యాంకర్లు బయలుదేరాయని…. అవి ఈ రోజు సాయంత్రం నాటికి అన్ని రిటైల్ బంకులకు చేరుకుంటాయని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ రోజు సాయంత్రం కల్లా మెజారిటీ ప్రాంతాల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి వస్తుందని హామీ ఇచ్చారు. అధికారులు, చమురు సంస్థలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఆందోళనను తొలగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రతి 3 గంటలకోసారి నివేదిక….

కేవలం కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడం కాకుండా, కలెక్టర్లు మరియు ఉన్నతాధికారులు స్వయంగా ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి పర్యవేక్షించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పరిస్థితులను రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

“జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతీ 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలి. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలి. బ్లాక్ మార్కెట్‌, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి” అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

బ్లాక్ మార్కెట్ చేస్తే ఉక్కుపాదమే!

కొరతను సాకుగా చూపి అక్రమ నిల్వలకు పాల్పడే వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. "బ్లాక్ మార్కెట్ లేదా కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని పోలీసు మరియు సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. డిపోల నుంచి బంకులకు వెళ్లే ట్యాంకర్లకు ఎటువంటి జాప్యం కలగకుండా చూడాలని…. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు విరామం లేకుండా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More