పొగాకు కొనుగోళ్లల్లో వేగం పెంచండి - సీఎం చంద్రబాబు
పొగాకు కొనుగోళ్లల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా పంట ఉత్పత్తుల కొనుగోలు జరగాలని సూచించారు.ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాలన్నారు.
పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని… వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సచివాలయంలో మామిడి, పొగాకు, కోకో పంటల మద్ధతు ధరతో పాటు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకూ 27 మిలియన్ కేజీల మేర విక్రయాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డీ బర్లి పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల మేర పొగాకును ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు సీఎంకు అధికారులు తెలిపారు. బాపట్ల -3, గుంటూరు--2, పలనాడు -1, ప్రకాశం - 1 కొనుగోలు కేంద్రాలు ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని.. వీటి ద్వారా రేపటి నుంచే కొనుగోళ్లు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కొనుగోళ్ల కేంద్రాల వివరాలను, సంబంధిత సమాచారాన్ని ప్రతీ పొగాకు రైతుకు అందివ్వాలని సీఎం ఆదేశించారు.
గ్రేడింగ్ విధానాలు అమలు చేయండి - సీఎం చంద్రబాబు
పామ్ ఆయిల్ పై సుంకం తగ్గింపు, మ్యాంగోపల్ప్ పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడి పంటకు సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు.
ప్రస్తుతం మామిడికి ఒక్కో కిలోకు రూ.4 చొప్పున అదనంగా మద్ధతు ధర ఇస్తున్నామని.. ప్రాసెసింగ్ యూనిట్లు రూ.8కి తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఏడాదిలో కోకో 12 వేల మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే 10 వేల మెట్రిక్ టన్నుల మేర విక్రయం కూడా జరిగినట్టు తెలిపారు. ప్రతీ రోజూ 80 నుంచి 100 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపోందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్ కు అవసరమైనట్టుగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలను అమలు చేయాల్సిందిగా సీఎం సూచించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


