...
...
Next Story

AP Capital Amaravati : టార్గెట్ పెట్టుకుని అమరావతి పనులను పూర్తి చేయాలి - సీఎం చంద్రబాబు

రాజధాని అమరావతి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని స్పష్టం చేశారు.నాణ్యతతో నిర్మాణాలు ఉండాలని... కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

Published on: Apr 4, 2026, 14:54:17 IST
Advertisement

రాజధాని నిర్మాణ పనులపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణ పనులు చేస్తోన్న సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

ప్రస్తుతం రాజధానిలో వివిధ దశాల్లో రూ.57,821 కోట్ల విలవైన పనులు సాగుతోన్నాయని అధికారులు తెలిపారు. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణ పనులు ఇందులో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన పనులకు సంబంధించి ఉన్న వివాదాలు, సమస్యలు పరిష్కరించి పనులు చేపట్టినట్లు సీఆర్డీఏ అధికారులు వివరించారు.

ప్రస్తుతం రాజధానిలో 20 వేల మంది కార్మికులు, నిపుణులు పనులు చేస్తున్నారు. ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది...టార్గెట్ ను ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎంత మంది కార్మికులు పని చేయాలి..? ఎంత మంది పనిచేస్తున్నారు...? ఎంత మిషనరీ ఉపయోగించాలి..? అనే విషయాలపై సమగ్రంగా చర్చించారు.

టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయాలి - సీఎం చంద్రబాబు

వారం, నెల టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి చేయాల్సిన పనులపై తాము పెట్టుకున్న లక్ష్యాలను అధికారులు వివరించారు. రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దని... ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములువుతున్నట్టే అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చని సీఎం ప్రకటించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీరాల్సిందేనని… ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని స్పష్టం చేశారు. మ్యాన్ పవర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని... ప్రతి నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభించుకోవాలని సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks