వెంకటేశ్వర స్వామే నాకు ప్రాణభిక్ష పెట్టాడు.. తప్పు చేస్తే వదిలిపెట్టడు : సీఎం చంద్రబాబు

అమరావతిలో అద్భుతంగా వెంకటేశ్వరస్వామి ఆలయం ఉండనుంది. ఈ మేరకు ఆలయ విస్తరణకు చంద్రబాబు భూమిపూజ చేశారు.

Published on: Nov 27, 2025, 13:08:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.260 కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భూమిపూజ చేశారు. రెండు దశల్లో ఈ పనులు జరగనున్నాయి. దేవతల రాజధాని మాదిరిగానే ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

పూజా కార్యక్రమంలో చంద్రబాబు
పూజా కార్యక్రమంలో చంద్రబాబు

'2003లో క్లైంబర్ మెయిన్స్ పెట్టినా నాకు ప్రాణ బిక్ష పెట్టినది వెంకటేశ్వరస్వామి. ఈ ప్రదేశంలో ఏ తప్పు జరగనివ్వను. తప్పు చేస్తే వెంకటేశ్వరుడు వదిలిపెట్టడు. గత ప్రభుత్వం విధ్వంసం చేసింది. అమరావతి రైతులకు నరకం చూపించారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారు.' అని చంద్రబాబు అన్నారు.

రూ.260 కోట్ల పనులను రెండు దశల్లో చేస్తారు. మొదటి దశలో కాంపౌండ్ వాల్, ఏడు అంతస్తుల మహా గోపురం, ఆర్జిత సేవా మండపం, రాధా మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి పనులను నిర్మించడానికి మొత్తం రూ.140 కోట్లు ఖర్చు చేస్తారు.

ఇక రెండో దశలో మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రి నివాసాలు, అర్చకులు మరియు సిబ్బందికి నివాసాలు, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ స్థలాల అభివృద్ధి ఉంటాయి. వీటికి రూ.120 కోట్లు కానున్నాయి.

గతంలో టీటీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 2019కి ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 25.417 ఎకరాలు కేటాయించింది. రూ.185 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు వేసింది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేటాయించిన భూమిని తగ్గించడం, రూ.36 కోట్లకు కుదించడం చేసింది.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలయ విస్తరణ, అభివృద్ధిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. గతంలోకంటే మరిన్ని సదుపాయాలు, ఆకట్టుకునే డిజైన్‌తో ఈ ఆలయాన్ని విస్తరించనున్నారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని, వారాంతాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయ అధికారులు, గ్రామస్తులు ప్రతిరోజూ అన్నప్రసాదం నిర్వహిస్తారు. పూర్తి సౌకర్యాలతో అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా స్థాపించాలని ప్రభుత్వం అనుకుంటోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More