వైఎస్ జగన్‌కు చంద్రబాబు బర్త్ డే విషెస్ - పవన్, షర్మిల కూడా పోస్టులు….!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షాలు తెలిపారు. బర్త్ డే గ్రీటింగ్ టు వైఎస్ జగన్ గారూ అని ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైఎస్ షర్మిల కూడా జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.

Published on: Dec 21, 2025, 12:58:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే క్రమంలో… వైఎస్‌ జగన్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్)‌ వేదికగా శుభాకాంక్షలు పేర్కొన్నారు.

వైఎస్ జగన్ బర్త్ డే - సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
వైఎస్ జగన్ బర్త్ డే - సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

వైఎస్ జగన్ కు విషెస్…

'వైఎస్‌ జగన్‌ గారూ జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడూ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

“మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

c

Birthday greetings to former Chief Minister YS Jagan Mohan Reddy. Wishing him good health and a long life.

@ysjagan

“YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా” అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోస్ట్ చేశారు.

మరోవైపు జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. రకరకాల పోస్టులతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. మరోవైపు రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More