టీచర్ అభ్యర్థులకు అలర్ట్ - ‘సీ టెట్ 2026’ దరఖాస్తులు ప్రారంభం, ముఖ్యమైన సమాచారం

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీ -టెట్‌ 2026)  నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది.  ఇందుకు సంబంధించిన పరీక్షను ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహిస్తారు.

Published on: Nov 28, 2025, 11:36:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీ టెట్‌ - 2026 ఫిబ్రవరి సెషన్) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 18వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

సీటెట్ నోటిఫికేషన్ 2026
సీటెట్ నోటిఫికేషన్ 2026

ఇందుకు సంబంధించిన పరీక్షను 2026 ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 132 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు Paper- I, Paper-II రాయాల్సి ఉంటుంది. మొత్తం 22 భాషాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బులెటిన్ ను సీటెట్ అధికారిక వెబ్ సైట్ https://ctet.nic.in లో చూడొచ్చు. ఇందులో సిలబస్ వివరాలను కూడా పొందుపరుస్తారు.

అప్లికేషన్ లింక్ వివరాలు…

అర్హులైన అభ్యర్థులు https://ctet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 1000 (ఒక్క పేపర్), రూ. 2000(రెండు పేపర్లకు కలిపి) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు అయితే రూ. 500(ఒక్క పేపర్),రూ. 600(రెండు పేపర్లు) చెల్లించాలు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా ఇందులో నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. త్వరలోనే ఈ వివరాలన్నీ వెబ్ సైట్ లో అప్డేట్ అవుతాయి.

సీటెట్ క్వాలిఫై అయితే… దేశవ్యాప్తంగానూ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో టీచర్ గా పని చేసేందుకు సీటెట్ అవసరం. రాష్ట్రాల్లో కూడా టెట్ పరీక్ష పాస్ కావటం తప్పనిసరి కాబట్టి… సీటెట్ రాసేందుకు చాాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు.

  • సీటెట్ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణిస్తారు.
  • పేపర్ -2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 6 నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణిస్తారు.
  • ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయ, ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సీటెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థి కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్ కేటగిరీకి 150 మార్కులకు గాను కనీసం 90 మార్కులు (60 శాతం), ఎస్సీ, ఎస్టీలకు 150 మార్కులకు 82 మార్కులు (55 శాతం) రావాలి. సీటెట్ పరీక్ష స్కోర్ కార్డు జీవితాంతం చెల్లుబాటు అవుతుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://ctet.nic.in/
  • అప్లికేషన్ లింక్ - https://ctet.nic.in/apply-for-ctet-feb2026/
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More