ప్రైవేట్ ఎలక్రీషియన్ల కష్టాలు..! గొప్ప మనసు చాటుకున్న డిప్యూటీ సీఎం పవన్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు రక్షణ కల్పించే ప్రయత్నం చేశారు. విధుల్లో భాగంగా ప్రాణాలకు రక్షణ ఉండేలా సేఫ్టీ కిట్స్ అందించారు.

Published on: Jun 8, 2025, 16:46:13 IST
By , , Pithapuram, Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎలక్ట్రీషియన్ల ప్రాణాలకు రక్షణ కల్పించేలా సేఫ్టీ కిట్స్ అందజేశారు. ఇందుకోసం ఇవాళ మధ్యాహ్నం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న 325 మంది ఎలక్ట్రీషియన్లకు సెఫ్టీ కిట్స్ పంపిణీ చేశారు.పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలను, టూల్ కిట్లను అందించారు.

సేఫ్టీ కిట్స్ అందించిన ఉప ముఖ్యమంత్రి పవన్
సేఫ్టీ కిట్స్ అందించిన ఉప ముఖ్యమంత్రి పవన్

ఇటీవల పిఠాపురంలో ఒక ఎలక్ట్రీషియన్ పని చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తో మృతి చెందారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్…. భవిష్యత్తులో మరొకరి ప్రాణాలు పోకూడదనే ఉద్దేశంతో ఈ కిట్లను అందించారు.

ఆ ఘటన తీవ్రంగా కలిచివేసింది - పవన్

ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్… గత ఏప్రిల్ నెలలో పిఠాపురం నియోజక వర్గంలోని మల్లం గ్రామంలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. “ఎలక్ట్రీషియన్ పనులు చేసి జీవించే 38 ఏళ్ల పల్లపు సురేష్ బాబు దురదృష్టవశాత్తు ఒకరి ఇంటిలో కరెంటు మరమ్మత్తు పని చేస్తూ విద్యుధాఘాతానికి గురై మృతి చెందాడు. సురేష్ బాబు మృతితో అతని కుటుంబం పోషకుడిని కోల్పోయింది. నిరాధారంగా మారడమే కాకుండా… ఈ సంఘటన గ్రామంలో సాంఘికంగా అవాంఛనీయమైన అపోహలకు, స్పర్థలకు దారి తీసింది”అని చెప్పారు.

“ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే, రెండు అంశాలు మనకు స్పష్టం అవుతున్నాయి. ఒకటి పేదరికం కారణంగా సురేష్ బాబుకు విద్యుత్ పనులు చేసేపుడు వాడే రక్షణ పరికరాల లేక పోవడం. రెండవది ప్రమాదవశాత్తు అతడు చనిపోతే అతని కుటుంబానికి ఆదుకునేందుకు ఆర్థిక భద్రత లేకపోవడం. అందుకే ఇటువంటి సంఘటన పునరావృతం కాకూడదనే నిశ్చయంతో పిఠాపురం నియోజకవర్గంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్న కార్మికులందరికి రక్షణ, భద్రత కల్పించాలని” నిశ్చయించుకున్నాని పవన్ వెల్లడించారు.

325 మంది కిట్స్…

ఇందులో భాగంగా పిఠాపురంనియోజక వర్గంలో పనిచేస్తున్న 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు కిట్స్ అందజేస్తారు. ఈ కిట్ లో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్స్ కిట్, రబ్బర్ హాండ్ గ్లోవ్స్, సేఫ్టీ షూస్, జాకెట్ ఉన్నాయి.

ఈ 325 మంది ప్రయివేట్ ఎలక్ట్రీషియన్లను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న ఈ-శ్రమ్ సంక్షేమ పోర్టల్ లో నమోదు చేసి యూఏఎన్ నెంబర్ జారీ చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ చెప్పారు. కార్మికుడు ప్రమాద వశాత్తు మరణించినా లేదా పూర్తి అంగవైకల్యం సంభవిస్తే 2 లక్షల రూపాయలు, పాక్షిక వైకల్యం సంభవిస్తే లక్షరూపాయాలు ఎక్సేగ్రేషియా అతని కుటుంబానికి చెల్లించి ఆర్ధికంగా ఆదుకోనున్నట్లు తెలిపారు.

కరెంటు పనులు చేసేటప్పుడు ఈ రక్షణ పరికరాలను తప్పని సరిగా వాడాలని ఎలక్ట్రీషియన్లను పవన్ప్రత్యేకంగా కోరారు. అలాగే వాటి ఎలా వినియోగించాలో, విద్యుత్ పనులు చేసేపుడు పాటించవలసిన జాగ్రత్తలపై ఎలక్ట్రీషియన్లకు ఓరియెంటేషన్ నిర్వహించాలని విద్యుత్ శాఖ ఇంజనీర్లను కోరారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More