ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు అనిష్ న్యూజెర్సీలోని వారి అపార్ట్‌మెంట్‌లో 2017లో మృతి చెందారు. ఎనిమిది సంవత్సరాలకు పైగా గడిచిన తర్వాత అమెరికా అధికారులు ఒక భారతీయ వ్యక్తి హత్య చేసినట్టుగా గుర్తించారు. నజీర్ హమీద్ న్యూజెర్సీకి చెందిన ఒక కంపెనీలో శశికళ నర్రా భర్తకు సహోద్యోగి అని, అతడే హత్య చేసినట్టుగా తెలుసుకున్నారు.

ఏపీకి చెందిన నర్రా హనుమంతరావు అనే వ్యక్తి న్యూజెర్సీలోని మాపుల్ షేడ్‌లోని ఫాక్స్ మేడో అపార్ట్‌మెంట్స్‌లో భార్య శశికళ నర్రా(38), అతని 6 ఏళ్ల కుమారుడు అనిష్‌తో కలిసి నివసించేవాడు. మార్చి 23, 2017న ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అపార్ట్‌మెంట్‌లో భార్య, కుమారుడు చనిపోయి కనిపించారు. వారిపై అనేక కత్తిగాట్లు ఉన్నాయి. వారిద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే హనుమంతరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అయితే ఈ కేసులో భాగంగా మెుదట భర్త నర్రా హనుమంతారావును అరెస్ట్ చేశారు. అతడికి ఓ మహిళతో సంబంధం ఉండటమే ఈ హత్యకు కారణం అని బంధువులు ఆరోపించారు. కానీ దర్యాప్తు అధికారులు ఘటన స్థలం నుండి రక్తపు మరక నమూనాలను సేకరించారు. ఆ డీఎన్ఏ బాధితులది కాదని, అలాగే హనుమంతరావుది కూడా తేలింది.
హనుమంతరావుకు అతడి ఇంటికి సమీపంలోనే ఉండే హమీద్‌కు మధ్య గొడవలు ఉన్నట్టుగా అధికారులు తెలుసుకున్నారు. ఆ వైపుగా దర్యాప్తు మెుదలుపెట్టారు. హత్యలు జరిగిన 6 నెలల తర్వాత హమీద్ భారతదేశానికి వచ్చేశాడు. అమెరికా పోలీసులు హమీద్ డీఎన్ఏ కోసం చాలాసార్లు ప్రయత్నించారు. భారతీయ అధికారుల ద్వారా సంప్రదించినా అతడు ఇవ్వలేదు.
డీఎన్ఏ నమూనాను సేకరించాలనే ఉద్దేశంతో అధికారులు 2024లో కోర్టుకు వెళ్లారు. కాగ్నిజెంట్ కంపెనీ.. హమీద్‌కు జారీ చేసిన ల్యాప్‌టాప్‌ను తమకు పంపమని కోరారు. చివరికి ల్యాప్‌టాప్ నుండి డీఎన్ఏ సేకరించారు అధికారులు. నేరస్థలంలో దొరికిన నమూనాతో హమీద్ డీఎన్ఏ సరిపోలింది. నేరం అతడే చేసినట్టుగా తెలుసుకున్నారు.
{{/usCountry}}డీఎన్ఏ నమూనాను సేకరించాలనే ఉద్దేశంతో అధికారులు 2024లో కోర్టుకు వెళ్లారు. కాగ్నిజెంట్ కంపెనీ.. హమీద్‌కు జారీ చేసిన ల్యాప్‌టాప్‌ను తమకు పంపమని కోరారు. చివరికి ల్యాప్‌టాప్ నుండి డీఎన్ఏ సేకరించారు అధికారులు. నేరస్థలంలో దొరికిన నమూనాతో హమీద్ డీఎన్ఏ సరిపోలింది. నేరం అతడే చేసినట్టుగా తెలుసుకున్నారు.
{{/usCountry}}హమీద్ భారతదేశానికి తిరిగి వచ్చినా కాగ్నిజెంట్ ఉద్యోగిగా కొనసాగాడు. తన నేర చరిత్రను దాచడానికి, తన జాడలను దాచడానికి టెక్నాలజీని వాడుకునే ప్రయత్నం చేశాడు. నర్రా కుటుంబానికి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే వేరే ఇంట్లో నివసించేవాడు హమీద్.
ఈ దారుణమైన హత్యల వెనుక హమీద్ ఉద్దేశం ఏంటో దర్యాప్తు అధికారులకు ఇంకా కచ్చితంగా తెలుసుకోలేదు. హనుమంతరావుపై కోపంతోనే అతడి భార్య శశికళ, కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు దర్యాప్తు అధికారులు హమీద్‌ను అమెరికాకు తీసుకువచ్చేందుకు విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్ చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పాట్రిక్ థోర్న్టన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటన జరిగినప్పుడు హమీద్ వీసాపై అమెరికాలో పనిచేస్తున్నాడని, అతను భారతదేశానికి తిరిగి వచ్చి అప్పటి నుండి అక్కడే ఉంటున్నాడని అన్నారు.