అమెరికాలో ఆంధ్రా మహిళ, ఆమె కుమారుడి హత్య.. ఏళ్ల తర్వాత హంతకుడిని ల్యాప్‌టాప్ ఎలా పట్టించింది?

2017లో అమెరికాలో ఆంధ్రాకు చెందిన మహిళ, ఆమె కుమారుడు హత్యకు గురయ్యారు. కొన్ని సంవత్సరాల తరువాత ల్యాప్‌టాప్ హంతకుడిని పట్టించింది.

Published on: Nov 19, 2025 3:05 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు అనిష్ న్యూజెర్సీలోని వారి అపార్ట్‌మెంట్‌లో 2017లో మృతి చెందారు. ఎనిమిది సంవత్సరాలకు పైగా గడిచిన తర్వాత అమెరికా అధికారులు ఒక భారతీయ వ్యక్తి హత్య చేసినట్టుగా గుర్తించారు. నజీర్ హమీద్ న్యూజెర్సీకి చెందిన ఒక కంపెనీలో శశికళ నర్రా భర్తకు సహోద్యోగి అని, అతడే హత్య చేసినట్టుగా తెలుసుకున్నారు.

2017లో శశికళ, అనిష్ హత్య
2017లో శశికళ, అనిష్ హత్య

ఏపీకి చెందిన నర్రా హనుమంతరావు అనే వ్యక్తి న్యూజెర్సీలోని మాపుల్ షేడ్‌లోని ఫాక్స్ మేడో అపార్ట్‌మెంట్స్‌లో భార్య శశికళ నర్రా(38), అతని 6 ఏళ్ల కుమారుడు అనిష్‌తో కలిసి నివసించేవాడు. మార్చి 23, 2017న ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అపార్ట్‌మెంట్‌లో భార్య, కుమారుడు చనిపోయి కనిపించారు. వారిపై అనేక కత్తిగాట్లు ఉన్నాయి. వారిద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే హనుమంతరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అయితే ఈ కేసులో భాగంగా మెుదట భర్త నర్రా హనుమంతారావును అరెస్ట్ చేశారు. అతడికి ఓ మహిళతో సంబంధం ఉండటమే ఈ హత్యకు కారణం అని బంధువులు ఆరోపించారు. కానీ దర్యాప్తు అధికారులు ఘటన స్థలం నుండి రక్తపు మరక నమూనాలను సేకరించారు. ఆ డీఎన్ఏ బాధితులది కాదని, అలాగే హనుమంతరావుది కూడా తేలింది.

హనుమంతరావుకు అతడి ఇంటికి సమీపంలోనే ఉండే హమీద్‌కు మధ్య గొడవలు ఉన్నట్టుగా అధికారులు తెలుసుకున్నారు. ఆ వైపుగా దర్యాప్తు మెుదలుపెట్టారు. హత్యలు జరిగిన 6 నెలల తర్వాత హమీద్ భారతదేశానికి వచ్చేశాడు. అమెరికా పోలీసులు హమీద్ డీఎన్ఏ కోసం చాలాసార్లు ప్రయత్నించారు. భారతీయ అధికారుల ద్వారా సంప్రదించినా అతడు ఇవ్వలేదు.

డీఎన్ఏ నమూనాను సేకరించాలనే ఉద్దేశంతో అధికారులు 2024లో కోర్టుకు వెళ్లారు. కాగ్నిజెంట్‌ కంపెనీ.. హమీద్‌కు జారీ చేసిన ల్యాప్‌టాప్‌ను తమకు పంపమని కోరారు. చివరికి ల్యాప్‌టాప్ నుండి డీఎన్ఏ సేకరించారు అధికారులు. నేరస్థలంలో దొరికిన నమూనాతో హమీద్ డీఎన్ఏ సరిపోలింది. నేరం అతడే చేసినట్టుగా తెలుసుకున్నారు.

హమీద్ భారతదేశానికి తిరిగి వచ్చినా కాగ్నిజెంట్ ఉద్యోగిగా కొనసాగాడు. తన నేర చరిత్రను దాచడానికి, తన జాడలను దాచడానికి టెక్నాలజీని వాడుకునే ప్రయత్నం చేశాడు. నర్రా కుటుంబానికి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే వేరే ఇంట్లో నివసించేవాడు హమీద్.

ఈ దారుణమైన హత్యల వెనుక హమీద్ ఉద్దేశం ఏంటో దర్యాప్తు అధికారులకు ఇంకా కచ్చితంగా తెలుసుకోలేదు. హనుమంతరావుపై కోపంతోనే అతడి భార్య శశికళ, కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు దర్యాప్తు అధికారులు హమీద్‌ను అమెరికాకు తీసుకువచ్చేందుకు విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్ చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పాట్రిక్ థోర్న్టన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటన జరిగినప్పుడు హమీద్ వీసాపై అమెరికాలో పనిచేస్తున్నాడని, అతను భారతదేశానికి తిరిగి వచ్చి అప్పటి నుండి అక్కడే ఉంటున్నాడని అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More