కరెంట్, తాగునీటి విషయంలో జాగ్రత్త.. తుపాను తర్వాత పాటించాల్సిన విషయాలు!

మెుంథా తుపాను తీరం దాటించి. కానీ అది చూపించిన ప్రభావం ఇంకా తగ్గలేదు. తుపాను తర్వాత పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా బయటకు వెళ్లకూడదు.

Published on: Oct 30, 2025, 08:44:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణను అతలాకుతలం చేసింది. వాగులు, వంకల గుండా నీరు ప్రవహిస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి.

తుపాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తుపాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తుపాను తర్వాత నీరు తాగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. దీనితో చాలా రకాల రోగాలు వస్తాయి. అందుకే కేవలం వేడిచేసిన లేదా క్లోరినేటెడ్ నీరు మాత్రమే తాగాలి. తుపాను ప్రభావం తగ్గింది కదా అని బయట తిరగకండి. అధికారిక సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం.

మీరు పునరావాస కేంద్రంలో ఉంటే అధికారులు చెప్పేవరకు తిరిగి ఇంటికి వెళ్లవద్దు. చెప్పకుండా ఇంటికి వెళ్లి మళ్లీ ప్రమాదంలో పడకూడదు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులైన లేదా తెగిన తీగలు, పదునైన వస్తువుల దగ్గరికి వెళ్లవద్దు. ఈ సమయంలో ఇంటి గోడల గుండా కూడా కరెంట్ వెళ్లే అవకాశం ఉంది. చెక్ చేయించుకోవాలి.

దెబ్బతిన్న లేదా పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు. మీరు వెళ్లిన తర్వాత కూలిపోతే ప్రాణాలకే ప్రమాదం. విద్యుత్ పరికరాల వినియోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తుపాన్ సమయంలో నీటికి తడిసిన లేదా దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను ఉపయోగించే ముందు ఎలక్ట్రీషియన్ ద్వారా తనిఖీ చేయించాలి. మీకు తెలియకుండా వాటిని రిపేర్ చేసే ప్రయత్నం చేయకండి. టీవీ, ఫ్రిడ్జ్, వాటర్ హీటర్ లాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తుపాను తర్వాత ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించాలి.

పంట పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే వెళ్లాలి. పాములు, ఇతర కీటకాలు ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒరిగిన చెట్ల కిందికి అస్సలు వెళ్లకండి. ఎప్పుడు విరిగి మీద పడేది తెలియదు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్న అస్సలు బయటకు రాకండి. ఇంకా తుపాను ప్రభావం తగ్గనందున విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోండి. బ్యాటరీతలో పనిచేసే టార్చిలైట్ను దగ్గర ఉంచుకోండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More