‘ఏఎస్సీ అర్జున్’ ఆన్ డ్యూటీ...! విశాఖ రైల్వే స్టేషన్ లో రోబో పోలీస్, దేశంలోనే తొలిసారి
ప్రయాణికుల భద్రత సేవలను పెంపొందించే దిశగా రైల్వే శాఖ మరో అడుగు ముందుకేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రోబో పోలీసును ప్రవేశపెట్టింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇందుకు వేదికైంది. దీనికి "ఏఎస్సీ అర్జున్" అని పేరు పెట్టారు.
భారతీయ రైల్వే చరిత్రలో తొలి రోబో పోలీస్ వచ్చేశాడు. ఇందుకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ వేదికైంది. తూర్పుకోస్తా జోన్ వాల్తేరు డివిజన్‌లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ)అలోక్ బొహ్రా, డీఆర్ఎం లలిత్‌బొహ్రా చేతుల మీదుగా ఈ రోబో కాప్ ను ఆవిష్కరించారు.

ఇదే తొలిసారి…
ప్రయాణీకుల భద్రతా సేవలను మరింత పెంపొందిచే దిశగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడిన రోబ్ పోలీసును ఏర్పాటు చేశారు. దీనికి "ఏఎస్సీ అర్జున్" గా పేరు పెట్టగా… భారతీయ రైల్వేలో ఇది మొదటిది.
ఈ రోబోను పూర్తిగా విశాఖపట్నంలో రూపొందించి అభివృద్ధి చేశారు. దేశీయ ఆవిష్కరణల ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అలోక్ బోహ్రా మరియు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మార్గదర్శకత్వంలో ఎ.కె. దూబే నేతృత్వంలోని బృందం ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేయడానికి ఒక సంవత్సరానికిపైగా శ్రమించారు.
"ASP ARJUN" అనేక కీలక కార్యాచరణలను కలిగి ఉంటుంది. చొరబాటు వంటి సమస్యలను సులభంగా గుర్తిస్తుంది. దీనిలోని రోబోట్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ఉపయోగించి చొరబాటుదారులను గుర్తిస్తుంది. IOT-ఎనేబుల్డ్ హెచ్చరికల ద్వారా RPF సిబ్బందిని తక్షణమే అప్రమత్తం చేయగలదు. రద్దీ నిర్వహణలో కూడా కీలక సూచనలు చేస్తుంది.
రద్దీ నియంత్రణకు సంబంధించిన సందేశాలను కూడా ఈ రోబ్ పోలీస్ పంపుతుంది. భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. సమాచార ప్రకటనలను ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగులో అందించబడతాయి. రద్దీ సమయాల్లో ప్రజలకు సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడానికి వీలు కల్పిస్తుంది.
ఈ సరికొత్త సేవలతో భద్రతా సిబ్బందిపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అగ్నిప్రమాదం వంటి ఘటనల సమయంలో తక్షణ హెచ్చరికలను జారీ చేయగలదు. ప్రయాణీకులకు నమస్తే, ఆర్పీఎఫ్ అధికారులకు వందనం వంటి సాంస్కృతిక హావభావాలను కూడా ఈ రోబో పోలీస్ కలిగి ఉంటుంది. ఆర్పీఎఫ్ కంట్రోల్ రూమ్ తో రియల్ టైమ్ ఐఓటీ కనెక్టివిటీ ఉంటుంది.
స్టేషన్‌లో నిత్యం పహారా కాస్తు అనుమానితులను గుర్తించడం, చొరబాటుదారులను కనుగొనడం వంటివి ఈ రోబో కాప్ చేస్తుంది. తరచూ దొంగతనాలకు పాల్పడేవారిని, అనుమానితుల చిత్రాలు తీసి విశ్లేషించి గుర్తించడంలో సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

