వారిద్దరూ గతంలో ప్రేమికులు..! కానీ కొన్ని కారణాలతో వారి వివాహనికి అడ్డంకులు ఎదురయ్యాయి. కట్ చేస్తే ప్రియుడికి మరో అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయిని దూరం పెడుతూ వచ్చాడు. కానీ ప్రియుడు దూరమైపోయాడన్న కారణంతో… ప్రియురాలు మాత్రం పెళ్లి చేసుకోలేదు. పైగా ప్రియుడి భార్యపై కక్ష పెంచుకుంది. ఆమెపై ప్రాణాంతక ఇంజెక్షన్‌తో దాడి చేసింది. నిర్ఘాంతపోయే ఈ ఘటన కర్నూల్ నగరంలో వెలుగు చూసింది.
అసలేం జరిగిందంటే..?

కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్ తెలిపిన వివరా ప్రకారం…. కర్నూల్ సిటీకి చెందిన ఓ వైద్యుడు… వసుంధర అనే స్థానిక మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత వీరి మధ్య ప్రేమ కొనసాగింది. కానీ కొన్ని కారణాల రీత్య వీరి వివాహం జరగలేదు. కొన్నాళ్ల కిందట వైద్యుడికి…శ్రావణి అనే మరో వైద్యురాలితో వివాహమైంది. అప్పట్నుంచి వసుంధరకు దూరంగా ఉంటున్నాడు. దీంతో వసుంధర్ వైద్యుడి కుటుంబంపై కక్ష పెంచుకుంది. ప్రియుడి భార్యను చంపేందుకు కుట్ర చేసింది. ఇందుకోసం పెద్ద మాస్టర్ ప్లానే రచించింది.
ఈనెల 9న వైద్యుడి భార్య ద్విచక్రవాహనంపై బయటికి వెళ్లింది. కేసీ కెనాల్ సమీపంలోకి రాగానే మరో స్కూటీ వచ్చి… శ్రావణి బైకును ఢీకొట్టింది. ఇంతలో ఆమె కిందపడిపోగా… ఆమెను వెంటనే ఇద్దరు మహిళలు వచ్చి ఆటోలోకి ఎక్కించారు. ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రాథమిక చికిత్స పేరుతో వారితో తెచ్చుకున్న వైరస్ ఇంజెక్షన్ ఎక్కించారు.
బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వారంతా అక్కడి నుంచి పారిపోయారు.బాధితురాలు వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి.. తమదైనశైలిలో దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరా పుటేజి, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కేసు విచారణ చేపట్టగా కీలక విషయాలు బయటికి వచ్చాయి. ఇదంతా కూడా వసుంధర చేసిన కుట్రగా గుర్తించారు. ఆమెకు సహకరించిన జ్యోతి అనే మహిళతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఎలాంటి ఇంజెక్షన్ ఇచ్చారనే దానిపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. పూర్తిస్థాయి నివేదికలు వచ్చిన తర్వాత… త్వరలోనే ఛార్జీషీట్ ఫైల్ చేస్తామని చెప్పారు.
{{/usCountry}}సీసీ కెమెరా పుటేజి, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కేసు విచారణ చేపట్టగా కీలక విషయాలు బయటికి వచ్చాయి. ఇదంతా కూడా వసుంధర చేసిన కుట్రగా గుర్తించారు. ఆమెకు సహకరించిన జ్యోతి అనే మహిళతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఎలాంటి ఇంజెక్షన్ ఇచ్చారనే దానిపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. పూర్తిస్థాయి నివేదికలు వచ్చిన తర్వాత… త్వరలోనే ఛార్జీషీట్ ఫైల్ చేస్తామని చెప్పారు.
{{/usCountry}}