...
...
Next Story

బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలి.. హిందూపురంలో ఫ్యాన్స్ డిమాండ్

నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. అభిమానులు కాన్వాయ్ అడ్డుకుని నినాదాలు చేశారు.

Published on: Oct 14, 2025, 11:11:22 IST
Advertisement

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అభిమానులు కాన్వాయ్ అడ్డుకుని.. బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓపిక పట్టాలని, అవసరం అయినప్పుడు పదవి వస్తుందని బాలయ్య చెప్పారు.

బాలకృష్ణ
బాలకృష్ణ

పర్యటనలో భాగంగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డి బసవనపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు గదులు, బీటీ రోడ్డును ఎమ్మెల్యే బాలయ్య ప్రారంభించారు. బీటీ రోడ్డు ప్రారంభోత్సవం తర్వాత టీడీపీ కార్యకర్తలు, ఫ్యాన్స్ బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలని బాలయ్య కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు.

హిందూపురం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అన్ని కష్టాల్లోనూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచినప్పటికీ బాలయ్య బాబుకు మంత్రి పదవి రావడం లేదని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ హిందూపూర్ పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు, మద్దతుదారులు తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ఊపుతూ, నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.

ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బాలకృష్ణ ఫేమ్ పని చేస్తుందని ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వారసత్వాన్ని పక్కనపెడుతున్నారని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

హిందూపురంలో పర్యటనలో పరిశ్రమలు, పాఠశాలలు స్థాపించిన దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీ రామారావును బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు చదువు పట్ల అంత శ్రద్ధ ఉండేది కాదని, ఎలాగోలా డిగ్రీ పూర్తి చేశానని బాలకృష్ణ చెప్పారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe