...
...
Next Story

గుడివాడలో అగ్ని ప్రమాదం - భారీగా ఆస్తి నష్టం….!

గుడివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నెహ్రూ చౌక్ సెంటర్‌లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వస్త్రాలు, యంత్రాలు కాలీ బూడిదయ్యాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

Published on: Dec 14, 2025, 11:03:39 IST
Advertisement

కృష్ణా జిల్లాలోని గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున మొబైల్ ఫోన్ దుకాణంలో మంటలు చెలరేగాయి. 4.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

గుడివాడలో అగ్ని ప్రమాదం - భారీగా ఆస్తి నష్టం
గుడివాడలో అగ్ని ప్రమాదం - భారీగా ఆస్తి నష్టం

గుడివాడలోని నెహ్రూ చౌక్ సెంటర్ సమీపంలోని మొబైల్ ఫోన్ షాపులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న మరికొన్ని బట్టల దుకాణాలకు మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ లేదా మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలుడు వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారి తెలిపారు.

భారీగా ఆస్తి నష్టం…

సమాచారం అందుకున్న వెంటనే… అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో రూ.1.2 కోట్ల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదని తెలిపారు.

ఎంతో దురదృష్టకరం - గుడివాడ ఎమ్మెల్యే

ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల నష్టం జరగడం ఎంతో దురదృష్టకరమన్నారు. కాంప్లెక్స్‌ను పరిశీలించి, దుకాణదారులను ప్రత్యక్షంగా కలుసుకుని వారి పరిస్థితిని తెలుసుకున్నారు.

నష్టపోయిన వ్యాపారులకు మనోధైర్యం చెప్పారు. ప్రభుత్వపరంగా అందుబాటులో ఉన్న సహాయాన్ని కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకునేలా సంబంధిత అన్ని శాఖల అధికారులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. గుడివాడలో భద్రతతో కూడిన అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks