...
...
Next Story

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. నాదెండ్ల మండలం గణపవరం బైపాస్ రోడ్డుపై కారులో అతివేగంగా ప్రయాణిస్తూ కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Published on: Dec 05, 2025 02:29 PM IST
Advertisement

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని గణపవరం గ్రామ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు ఇంజీనిరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మేడగం రామిరెడ్డి, శివరాత్రి మహేశ్, మెరుపు శ్రీకాంత్, వంగవోలు వాసు, గొడవర్తి యశ్వంత్ సాయిని మృతులుగా గుర్తించారు. మరో ఇద్దరు, మద్దుకూరి కార్తీక్, చలపతిలకు తీవ్ర గాయాలయ్యాయి, వీరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు ఆయప్ప స్వామి మాల ధరించి ఉన్నారని… వారంతా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థుల మృతి బాధాకారం - మంత్రి లోకేశ్

రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు దుర్మరణం పాలవడం బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారుయ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

ఈ ఘటనపై గుంటూరు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఐదుగురు విద్యార్థుల దుర్మరణం అత్యంత బాధాకరం. మృతుల్లో శ్రీకాంత్, వాసు, మహేష్, రామిరెడ్డి విజ్ఞాన్ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తుండగా, మరొకరు యస్వంత్ సాయి చలపతి కాలేజీలో చదువుతున్నారు. ఈ ఘోర ఘటన జరుగుటకు గల కారణాలపై సమగ్ర విచారణ చేయిస్తాం. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా అండగా నిలుస్తాం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి కార్తీక్ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe